ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో `యూనివర్సల్ హెల్త్ కవరేజ్` తీసుకురావాలనే లక్ష్యంతో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. పేద , మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ.. ప్రతి కుటుంబానికి రూ. 2,50,000 వరకు హెల్త్ ఇన్సూరెన్స్ సదుపాయాన్ని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. వైద్య ఖర్చులు భారమై సామాన్యులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో.. కార్పొరేట్ స్థాయి చికిత్సను అందరికీ అందుబాటులోకి తెచ్చేలా ఈ పథకాన్ని రూపొందించారు.
ఈ వినూత్న ఇన్సూరెన్స్ విధానం వల్ల రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలకు ఆరోగ్య భద్రత లభించనుంది. గతంలో ఉన్న పరిమితులను పెంచి, మధ్యతరగతి వర్గాలను కూడా ఇందులో చేర్చడం విశేషం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి విధివిధానాలు, దరఖాస్తు ప్రక్రియ వివరాలు ప్రభుత్వం త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది.




సీరియల్ కిస్సర్ 8 లిప్ లాక్స్

Loading..