Advertisementt

ఐక్యంగా ముందుకెళ్తోన్న పాన్ ఇండియా స్టార్లు

Wed 04th Mar 2026 10:53 AM
tollywood star heroes on bollywood  ఐక్యంగా ముందుకెళ్తోన్న పాన్ ఇండియా స్టార్లు
Tollywood Star Heroes Stand On Bollywood ఐక్యంగా ముందుకెళ్తోన్న పాన్ ఇండియా స్టార్లు
Advertisement
Ads by CJ

రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్, బ‌న్నీ, ప్ర‌భాస్ లు పాన్ ఇండియాలో స‌క్సెస్ అయిన త‌ర్వాత బాలీవుడ్ లో ఎన్నో అవ‌కాశాలు వ‌చ్చాయి. క‌ర‌ణ్ జోహార్ అయితే వాళ్లంద‌ర్నీ బాలీవుడ్లోనే లాక్ చేయాల‌ని చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. ఆయ‌న‌తో పాటు మ‌రికొన్ని అగ్ర నిర్మాణ సంస్థ‌లు ఎన్నో ఆఫ‌ర్లు ప్ర‌క‌టించాయి. కానీ ఏ హీరో టెంప్ట్ అవ్వ‌లేదు. ఈ విష‌యంలో మాత్రం హీరోలంతా ఎంతో ఐక్యంగానే ప‌ని చేసారు.

వ‌చ్చిన అవ‌కాశాల‌ను సున్నితంగా తిర‌స్క‌రించారు. అలాగ‌ని బాలీవుడ్ కి పూర్తిగా వ్య‌తిరేకం అని చెప్ప‌లేదు. రామ్ చ‌ర‌ణ్ టాలీవుడ్ లో స్టార్ గా ఉన్న స‌మ‌యంలో `జంజీర్` రీమేక్ తో అక్క‌డా లాంచ్ అయ్యాడు. ఆ చిత్రం తెలుగులో `తుఫాన్` గా రిలీజ్ అయింది.  ప్ర‌భాస్ `సాహో` చిత్రంతో హిందీకి వెళ్లాడు. ఎన్టీఆర్ `వార్ 2` తో లాంచ్ అయ్యాడు. ఇలా మ‌న హీరోలంతా బాలీవుడ్ లో మ‌మా అనిపించారు.

కానీ కేవ‌లం హిందీలోనే ఓ సినిమా చేయాలంటే మాత్రం ఒప్పుకోలేదు. మాతృభాష‌ను వ‌దిలేసి అక్క‌డ ప‌నిచేసేది లేద‌ని నిర్మొహ మాటంగా చెప్పేసారు. ఈ విష‌యంలో ఆ న‌లుగురు హీరోల నోట ఒకే మాట వ‌చ్చింది. ఇదే మాట సూప‌ర్ స్టార్ మ‌హేష్ కూడా ముందే చెప్పేసాడు. బాలీవుడ్ లో ఛాన్సులొస్తున్నాయి?  ఎందుకు వెళ్ల‌లేదు అంటే తానేం చేయాల‌నుకున్నా హైద‌రాబాద్ లో ఉండే చేస్తాన‌న్నారు.

`వార‌ణాసి` త‌ర్వాత కూడా మ‌హేష్ ఇదే మాట చెబుతాడు. తానెంత పెద్ద స్టార్ అయినా?  హాలీవుడ్ లో అవ‌కాశాలు వ‌చ్చినా?  టాలీవుడ్ ను వ‌దిలే ప్ర‌శ‌క్తే ఉండ‌ద‌న్న‌ది ఎక్క‌డైనా బ‌లంగా చెప్పే న‌టుడాయ‌న. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి కూడా `పుష్ప 2` రిలీజ్ అనంత‌రం చాలా హిందీ అవ‌కాశాలు వ‌చ్చాయి. కానీ నో ఛాన్స్ అనేసాడు.  

Tollywood Star Heroes Stand On Bollywood:

Star Heroes Stand On Bollywood

Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ