Advertisementt

బాఫ్టా-2026లో తెలుగు సినిమా ఎక్క‌డ‌

Tue 24th Feb 2026 11:31 AM
bafta  బాఫ్టా-2026లో తెలుగు సినిమా ఎక్క‌డ‌
Boong from Manipur wins big at Bafta బాఫ్టా-2026లో తెలుగు సినిమా ఎక్క‌డ‌
Advertisement
Ads by CJ

ఆస్కార్ విన్నింగ్ సినిమా అంటూ ఆర్.ఆర్.ఆర్ గురించి చాలా పొగ‌డ్త‌లు వినిపిస్తుంటాయి. అంత‌ర్జాతీయ సినిమా వేదిక‌ల‌పై తెలుగు సినిమా స‌త్తా చాటింద‌ని, భార‌తీయ సినిమాకి గౌర‌వం పెరిగింద‌ని చ‌ర్చ సాగుతుంది. కానీ ఆస్కార్ ఒక్క‌టే స‌రిపోతుందా?  ప్ర‌పంచ స్థాయి వేదిక‌ల‌పై భార‌తీయ సినిమా లేదా తెలుగు సినిమా ఇంకా చాలా సాధించాల్సి ఉంటుంది.

 

అయితే ఈ విష‌యాన్ని ఇప్పుడే ఎందుకు చ‌ర్చిస్తున్నాము అంటే.. ప్ర‌తిష్ఠాత్మ‌క బాఫ్టా -2026 పుర‌స్కారాల్లో అతి చిన్న ప‌రిశ్ర‌మ నుంచి వెళ్లిన భార‌తీయ సినిమా విజ‌యం సాధించింది. మ‌ణిపురి ప‌రిశ్ర‌మ‌లో తెర‌కెక్కిన `బూంగ్` అనే చిత్రం `పిల్ల‌లు మ‌రియు కుటుంబ డ్రామా విభాగం`లో బాఫ్టా అవార్డును గెలుచుకుంది. ఈ సినిమా బ‌డ్జెట్ చాలా చిన్న‌ది. కానీ మంచి క‌థ‌తో స‌హ‌జ‌సిద్ధ‌మైన లొకేష‌న్ల‌లో అద్భుత‌మైన భావోద్వేగాల‌ను తెర‌పైకి తెచ్చార‌నే ప్ర‌శంస‌ల్ని అందుకుంటున్నారు మేక‌ర్స్.  

 

`బూంగ్` ఒక చిన్న పిల్లాడి క‌థ‌. ఆ బాలుడు తన తల్లిని సంతోషపెట్టడం కోసం తండ్రిని వెతుక్కుంటూ వెళ్లే ప్రయాణమే ఈ సినిమా. మ‌ణిపురిలోని అంద‌మైన లొకేష‌న్లు, అక్క‌డి సామాజిక రాజ‌కీయ ప‌రిస్థితుల న‌డుమ ఆ పిల్లాడి పోరాటాన్ని అద్భుతంగా తెర‌కెక్కించారు. ఈ చిత్రానికి ల‌క్ష్మీ ప్రియా దేవి ద‌ర్శ‌కురాలు. ఫ‌ర్హాన్ అక్త‌ర్, రితేష్ సిధ్వానీ వంటి అగ్ర నిర్మాత‌లు అండ‌గా నిల‌వ‌డంతో టొరెంటో ఫిలిం ఫెస్టివ‌ల్ వంటి వేదిక‌ల ద్వారా ప్ర‌మోటై, ఇప్పుడు ఏకంగా ప్ర‌తిష్ఠాత్మ‌క బాఫ్టా 2026 పుర‌స్కారాన్ని గెలుచుకుంది. ఈ సినిమాకి ద‌క్కిన గౌర‌వానికి సింబాలిక్ గా గూగుల్ ఇప్పుడు సెర్చ్ ఇంజిన్ లో బూంగ్ యానిమేష‌న్ల‌ను ఉంచింది. బాఫ్టా వంటి వేదిక‌ల‌పై తెలుగు సినిమాలు మెర‌వాల‌ని కోరుకునేవారికి కొద‌వేమీ లేదు. కానీ ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు సాగాలంటే అగ్ర నిర్మాత‌ల అండ‌దండ‌ల‌తో ఔత్సాహిక క్రియేటివ్ ఫిలింమేక‌ర్స్ దీనిపై ఆలోచించాలి.

Boong from Manipur wins big at Bafta :

Boong a Manipuri language film wins big at Bafta

Tags:   BAFTA
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ