అక్కినేని ప్రిన్స్ అఖిల్ నటిస్తున్న లెనిన్ చిత్రం మే 1 న రిలీజ్ అవుతుందా.. మేకర్స్ లెనిన్ చిత్రాన్ని మే 1 కే సిద్ధం చేస్తారా అనే కన్ఫ్యూజన్ అక్కినేని ఫ్యాన్స్ లో నడుస్తుంది. రామ్ చరణ్ పెద్ది చిత్రం ఏప్రిల్ 30 న విడుదలవుతుంది. దానితో లెనిన్ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేస్తారేమో అనుకున్నారు. కానీ మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు.
దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరి లెనిన్ షూటింగ్ కి ఫాస్ట్ గా ఫినిష్ చేస్తున్నాడు. ఇప్పటికే క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తి కాగా.. మిగతా షూటింగ్ ని కూడా కిషోర్ చాలా స్పీడుగా ఫినిష్ చేస్తున్నాడు. అయితే రామ్ చరణ్ తో అఖిల్ పోటీపడతాడా, పెద్ది పై లెనిన్ పోటీకి సిద్దమేనా అనే విషయమే తేల్చడం లేదు .
రీసెంట్ గా లెనిన్ నుంచి వచ్చిన పోస్టర్ లో మే 1 అంటూ రిలీజ్ డేట్ వెయ్యలేదు. అక్కినేని ఫ్యాన్స్ లెనిన్ తో అఖిల్ ట్రాక్ లోకి రావాలి, భారీ హిట్ కొట్టాలని ఆశపడుతున్నారు. లెనిన్ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది. మరి లేనిన్ సమ్మర్ రాక ఉంటుందో, ఉండదో అనేది చూడాలి.




మతిపోగొడుతున్న శ్రీలీల న్యూ లుక్

Loading..