Advertisementt

దురాక్షిక్ వార్‌.. RGV కెలుకుడేంది

Mon 23rd Feb 2026 09:02 AM
dhurandhar 2 vs toxic  దురాక్షిక్ వార్‌.. RGV కెలుకుడేంది
Ram Gopal Varma Opinion on Dhurandhar 2 vs Toxic దురాక్షిక్ వార్‌.. RGV కెలుకుడేంది
Advertisement
Ads by CJ

మార్చి 19న దురంధ‌ర్ 2, టాక్సిక్ సినిమాలు విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాల్లో ఏది బెస్ట్? అంటూ నెటిజ‌నుల్లో ఆస‌క్తిక‌ర డిబేట్ ర‌న్ అవుతోంది. ఆర్జీవీ తాజాగా ఎక్స్ ఖాతాలో త‌న అభిప్రాయాన్ని పోస్ట్ చేసారు. ఆయ‌న స్ప‌ష్ఠంగా ఆదిత్యాధ‌ర్ తెర‌కెక్కించిన `దురంధ‌ర్ 2` వైపు మొగ్గు చూపారు. ప్ర‌జ‌ల‌ను తెలివైన వాళ్లు అనుకుని ద‌ర్శ‌కుడు ఆదిత్యాధ‌ర్ తెర‌కెక్కించార‌ని, టాక్సిక్ అలా కాకుండా ప్ర‌జ‌ల్ని ఫూల్స్ అనుకుని తీసార‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. క‌చ్ఛితంగా `దురంధ‌ర్` రేసులో విన్ అవుతుంద‌ని కూడా వంద‌శాతం అంచ‌నా వేస్తున్నాడు.

 

రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు రిలీజైతే ఎదుర‌య్యే స‌మ‌స్య‌లు చాలా ఉన్నాయి. ఈ రెండు సినిమాలపైనా ప్ర‌జ‌ల్లో భారీ అంచ‌నాలున్నాయి. అయితే ఆర్జీవీ `దురంధ‌ర్` చూసిన త‌ర్వాత ఆదిత్యాధ‌ర్ ప్ర‌తిభ‌కు ఫిదా అయిపోయాడు. అప్ప‌టి నుంచి అత‌డిని ప్ర‌శంసించ‌డాన్ని ఆప‌డం లేదు. ఇప్పుడు కూడా త‌న మ‌న‌సును చాటుకున్నాడు. య‌ష్ ప్ర‌ధాన పాత్ర‌లో గీతూమోహ‌న్ దాస్ తెర‌కెక్కించిన `టాక్సిక్` టీజ‌ర్ ఇటీవ‌ల విడుద‌లై ప్ర‌కంప‌నాలు సృష్టించిన సంగ‌తి తెలిసిందే. 

Ram Gopal Varma Opinion on Dhurandhar 2 vs Toxic:

RGV On Dhurandhar 2 vs Toxic

Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ