Advertisementt

న‌ట‌వార‌సుల‌పై తాప్సీ షాకింగ్ కామెంట్

Sun 22nd Feb 2026 12:41 PM
tapsee  న‌ట‌వార‌సుల‌పై తాప్సీ షాకింగ్ కామెంట్
Tapsee Shocking Comments on Tollywood న‌ట‌వార‌సుల‌పై తాప్సీ షాకింగ్ కామెంట్
Advertisement
Ads by CJ

ఇటీవ‌లి కాలంలో న‌ట‌వార‌స‌త్వం, ఔట్ సైడ‌ర్ ప్ర‌తిభ గురించి ఎక్కువ‌గా చ‌ర్చ సాగుతోంది. అయితే ఆలియా భ‌ట్ లాంటి న‌ట‌వార‌సురాలికి ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు వ‌రుస‌గా అవ‌కాశాలివ్వ‌డంపై తాప్సీ ప‌న్ను స్పందించింది. ఆలియా భ‌ట్ నేపో కిడ్ కాబ‌ట్టే సంజ‌య్ లీలా భ‌న్సాలీ వ‌రుస‌గా అవ‌కాశాలిస్తున్నారా?  గంగూభాయి క‌థియావాడీ త‌ర్వాత వెంట‌నే ల‌వ్ అండ్ వార్ చిత్రానికి ఎందుకు ఎంపిక చేసుకున్నాడు? అని ప్ర‌శ్నిస్తే తాప్సీ ఇచ్చిన స‌మాధానం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

 

నిజానికి గంగూభాయి క‌థియావాడీలో ఆలియా అద్భుతంగా న‌టించింది. త‌న‌తో బాగా ప‌ని చేసి ఔట్ పుట్ ఇచ్చే న‌టీమ‌ణితో మ‌రో సినిమా చేయాల‌ని ద‌ర్శ‌కుడు అనుకోవ‌డం త‌ప్పు కాద‌ని తాప్సీ ప‌న్ను స‌మ‌ర్థించారు. ఇలాంటి వాటిని ఎవ‌రూ నేపోటిజం అన‌రు. ప్ర‌తిభ ఉన్నా లేక‌పోయినా బయ‌టి నుంచి వ‌చ్చిన‌ ప్ర‌తిభావంతుల‌ను కాద‌ని, అదే న‌టికి వ‌రుస‌గా అవ‌కాశాలు క‌ల్పించే వారి విష‌యంలోనే నేపోటిజం వ‌ర్తిస్తుంద‌ని తాప్సీ ప‌న్ను అన్నారు.

 

అలాగే ద‌క్షిణాదిన ప్యాడెడ్ బ్రాల ఎంపిక గురించి కూడా తాప్సీ ప‌న్ను మాట్లాడారు. ద‌క్షిణాది ద‌ర్శ‌కులు ప్యాడెడ్ బ్రాలు ధ‌రించాల‌ని క‌థానాయిక‌ల‌కు చెబుతార‌ని, అయితే సెట్లో ఆ తేడా చూస్తున్నప్పుడు ఎంత ఇబ్బందిక‌రంగా ఉంటుందో ఊహించుకోండి అని తాప్సీ ప‌న్ను అన్నారు. అలాగే సందీప్ వంగా యానిమ‌ల్ సినిమాపై చేసిన గ‌త వ్యాఖ్య‌ల‌ను తాప్సీ వెన‌క్కి తీసుకున్నారు. అదే పాత్ర‌ను వేరొక ద‌ర్శ‌కుడు అంత బాగా చూపించ‌లేడ‌ని ఈ విష‌యంలో సందీప్ వంగా గ్రేట్ అని తాప్సీ ప‌న్ను ప్ర‌శంసించారు. ఈ పాత్ర‌ను వేరే ద‌ర్శ‌కులు హాస్యాస్ప‌దంగా చూపించి ఉండొచ్చ‌ని కూడా విశ్లేషించారు. అస్సీ అనే చిత్రంలో తాప్సీ న‌టించింది. ఇటీవ‌లే ఈ చిత్రం థియేట‌ర్ల‌లో విడుద‌లైంది.

Tapsee Shocking Comments on Tollywood:

Tapsee Targets Tollywood Again

Tags:   TAPSEE
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ