Advertisementt

శివకార్తికేయన్ - సెయాన్

Mon 16th Feb 2026 06:52 PM
sivakarthikeyan  శివకార్తికేయన్ - సెయాన్
Sivakarthikeyan-Kamal Haasan film gets a powerful title శివకార్తికేయన్ - సెయాన్
Advertisement
Ads by CJ

కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ అమరన్ తర్వాత మరోసారి కమల్ హాసన్ బ్యానర్ లో నటిస్తున్నారు. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వంలో SK 26 ప్రాజెక్ట్ ని అనౌన్స్ చెయ్యడమే కాదు తాజాగా ఈచిత్ర టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రివీల్ చేసారు. ఈ చిత్రానికి సెయాన్ అనే పవర్ ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. 2026లో బిగ్గెస్ట్ ఫ్యామిలీ స్పెక్టకిల్‌గా నిలిచేలా ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్, వినోదాన్ని మేళవిస్తూ ఈ సినిమా రూపొందుతోంది.

ఫస్ట్ లుక్ పోస్టర్‌లో శివకార్తికేయన్ డివైన్ ల్లూక్ కనిపిస్తున్నారు. ధోతి, విభూతి, రుద్రాక్షలతో సంప్రదాయానికి దగ్గరగా కనిపిస్తూ, చేతిలో వంపు ఉన్న కత్తి ఆయన ప్రశాంతత వెనుక దాగిన శక్తిని సూచిస్తోంది. వెనుకన కనిపించే నెమలి రెక్కలు, చుట్టూ ఉన్న నెమళ్లు మురుగన్ స్వామి ప్రతీకను గుర్తు చేస్తూ పాత్రకు మిథికల్ ఆరా అందిస్తున్నాయి. ఈ చిత్రంలో  శివకార్తికేయన్ పవర్‌ఫుల్, డైనమిక్ పాత్రలో కనిపించనున్నారు.

Sivakarthikeyan-Kamal Haasan film gets a powerful title:

Sivakarthikeyan-Kamal Haasan titled powerfully first look out

Tags:   SIVAKARTHIKEYAN
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ