పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చి బాబు దర్శకత్వంలో పెద్ది షూటింగ్ ముగించే పనిలో బిజీగా వున్నారు. రీసెంట్ గా కవలలకు తండ్రయిన రామ్ చరణ్ ఏ మాత్రం బ్రేక్ తీసుకోకుండా పెద్ది షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఏప్రిల్ 30 న పెద్ది రిలీజ్ అంటూ మేకర్స్ అనౌన్స్ చేసారు.
ఇక రామ్ చరణ్ పెద్ది తర్వాత టాప్ డైరెక్టర్ సుకుమార్ తో RC 17 అనౌన్స్ చేసారు. ఈ చిత్రం రంగస్థలానికి మించి ఉండబోతుంది అనే టాక్ వినబడుతుంది. పుష్ప 2 రిలీజ్ తర్వాత సుకుమార్ బిగ్ బ్రేక్ తీసుకుని RC 17 స్క్రిప్ట్ లాక్ చేసే పనిలో ఉన్నారు. అయితే ఈ చిత్రాన్నిఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారో అనే విషయంలో ఓ న్యూస్ హల్ చల్ చేస్తుంది.
మార్చ్ 27 రామ్ చరణ్ బర్త్ డే. అంతకు ముందు రోజు అంటే మార్చ్ 26 శ్రీరామనవమి రోజున RC 17 ని పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టేందుకు సుకుమార్ సన్నద్ధమవుతున్నారని, ఈ పూజా కార్యక్రమంలో రామ్ చరణ్ పాల్గొంటారని తెలుస్తుంది. మరోపక్క త్వరలో రిలీజ్ కాబోతున్న పెద్ది సెకండ్ సింగిల్ పై అంతకంతకు అంచనాలు పెరిగిపోతున్నాయి.





ప్రముఖ సింగర్పై భార్య రచ్చ రచ్చ
Loading..