Advertisementt

బ్యాక్ టూ బ్యాక్ అనుకుంటే షాక్ ఇచ్చిన హీరో

Wed 21st Jan 2026 10:33 AM
ranbir  బ్యాక్ టూ బ్యాక్ అనుకుంటే షాక్ ఇచ్చిన హీరో
Disappointment For Ranbir Fans బ్యాక్ టూ బ్యాక్ అనుకుంటే షాక్ ఇచ్చిన హీరో
Advertisement
Ads by CJ

రాక్ స్టార్ రణబీర్ కపూర్ అభిమానుల‌కు ఓ గుడ్ న్యూస్..మ‌రో బ్యాడ్ న్యూస్. ఇంత‌కీ ఏంటా గుడ్ బ్యాడ్ అంటే వివ‌రాల్లోఇకి వెళ్లాల్సిందే. ఈ దీపావ‌ళికి `రామాయ‌ణం`  మొద‌టి భాగంతో `రాముడిగా గెట‌ప్ లో ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుండగా, `ల‌వ్ అండ్ వార్` కోసం ప్రేక్ష‌కాభిమానులు ఇంకొంత కాలం ఎదురు చూడ‌క త‌ప్ప‌దు.

బాలీవుడ్ చిత్రాల రిలీజ్ క్యాలెండర్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి.

 

రణబీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ `లవ్ అండ్ వార్`  అధికారికంగా 2026 నుండి తప్పుకుంది. వాస్త‌వానికి  ఈ  చిత్రాన్ని 2026 క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు 2027 జ‌న‌వ‌రి 26 రిపబ్లిక్ డే  లేదా ఫిబ్ర‌వ‌రి 14 వాలెంటైన్స్ డే  విడుదల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. అందుకు కార‌ణం  అనుకున్న స‌మ‌యంలో షూటింగ్  పూర్తి కాక‌పోవ‌డ‌మే.

 

ఇంకా చాలా  భాగం షూటింగ్  మిగిలి ఉంది. షూటింగ్ మొత్తం పూర్తి కావడానికే 2026 జూన్ వరకు సమయం పట్టేలా ఉంది. వార్ మూవీ కూడా కావడంతో ఇందులో భారీ ఏరియల్ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. వీటికి భారీస్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్  అవసరం. నాణ్యత విషయంలో ద‌ర్శ‌కుడు సంజ్ లీలా భ‌నాలీ ఎంత మాత్రం  రాజీపడరు. ఆ పనులను హడావిడిగా చుట్టేసి రిలీజ్ చేయాల‌నే ద‌ర్శ‌కుడు కాదు.

 

అలాగే మ‌రో బ‌ల‌మైన కార‌ణం కూడా ఉంది. `రామయ‌ణం పార్ట్ 1` రిలీజ్ అయిన వెంట‌నే `ల‌వ్ అండ్ వార్` రిలీజ్ చేయ‌డం కూడా మైన‌స్ అవుతుంద‌ని భావిస్తున్నారు. `రామాయణ: పార్ట్ 1` 2026 న‌వంబ‌ర్ లో దీపావళికి రిలీజ్ ఫిక్స్  అయ్యింది. ఆ సినిమా రిలీజ్ అయిన  రెండు నెలల వ్యవధిలో న‌వంబ‌ర్ లేదా డిసెంబ‌ర్ ల‌వ్ అండ్ వార్ రిలీజ్ చేయ‌డం వ‌సూళ్ల‌పై ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంద‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. అందుకే `ల‌వ్ అండ్ వార్` ని 2027 కి మారుస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక క‌న్ప‌ర్మేష‌న్ లేదు.

Disappointment For Ranbir Fans:

  Bad News For Ranbir Fans  

Tags:   RANBIR
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ