సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ 2తో అభిమానుల ముందుకు రానున్నాడు. జైలర్ చిత్రంతో తన కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న రజనీ, ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ పై కన్నేసారు. జైలర్ 2 చిత్రం జూన్ 12న విడుదల కానుంది. అంతకుముందే సంక్రాంతి సంబరాల కోసం రజనీ తన కుటుంబంతో కలిసి గడిపారు.
చెన్నైలోని తన నివాసంలో రజనీకాంత్ తన ఇద్దరు కుమార్తెలు (ఐశ్వర్య, సౌందర్య) , ఇతర కుటుంబ సభ్యులతో కలిసి పొంగల్ వండారు. పాలు పొంగే సమయంలో కుటుంబమంతా కలిసి ఆనందంతో ప్లేట్లపై స్పూన్లతో శబ్దం చేస్తూ `పొంగలో పొంగల్` అంటూ సంబరాలు చేసుకున్నారు. రజనీకాంత్ ఎప్పటిలాగే ఎంతో నిరాడంబరంగా తెల్లటి సిల్క్ షర్ట్, పంచె ధరించి కనిపించారు. కుటుంబ సభ్యులంతా చాలా ఆనందంగా పండగను సెలబ్రేట్ చేసుకున్నారు.




ఈ వారం ఓటీటీ చిత్రాలు
Loading..