Advertisementt

సక్సెస్ జోష్ లో గ్రాండ్ మెగా పార్టీ

Wed 14th Jan 2026 06:29 PM
mana shankara vara prasad garu  సక్సెస్ జోష్ లో గ్రాండ్ మెగా పార్టీ
Megastar Chiranjeevi Hosts Lavish Party సక్సెస్ జోష్ లో గ్రాండ్ మెగా పార్టీ
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి మెగా ఎంటర్‌టైనర్ మన శంకర వరప్రసాద్ గారు అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం కేవలం రెండు రోజుల్లోనే రికార్డులను బద్దలు కొట్టి, సంచలనాత్మకంగా 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 120 కోట్లు వసూలు చేసింది. ఇండియాలో ద్భుతమైన జోరును కొనసాగిస్తూ, ఉత్తర అమెరికాలో 2 మిలియన్ డాలర్ల మైలురాయికి చేరువవుతున్న తరుణంలో మెగాస్టార్ ఇంట్లో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఈ బ్లాక్‌బస్టర్ విజయాన్ని పురస్కరించుకుని, చిరంజీవి తన హైదరాబాద్ నివాసంలో ఒక గ్రాండ్ పార్టీని ఇచ్చి, ఆ సాయంత్రాన్ని సంక్రాంతి వేడుకల కొనసాగింపుగా మార్చారు. తారల సందడితో కూడిన వేడుకకు రామ్ చరణ్, వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెలతో పాటు పలువురు హాజరయ్యారు.

ఈ వేడుకలు ఉత్సాహభరితమైన కేక్ కటింగ్ కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి, అనంతరం చిత్ర బృందం అద్భుతమైన విందులో పాల్గొంది. నవ్వులు, కృతజ్ఞతలు, ఆత్మీయ సంభాషణలతో వేడుక కన్నుల పండగలా సాగింది. సినిమా ఘన విజయానికి కారణమైన ప్రతి సభ్యుడికి చిరంజీవి స్వయంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ వేడుకను విజయోత్సవంగా మాత్రమే కాకుండా ముందస్తు భోగి, సంక్రాంతి సంబరాలుగా ఆనందంగా జరుపుకున్నారు. టీంలో కనిపించిన ఐక్యత, సినిమాకు లభిస్తున్న డ్రీమ్ రన్ కలిసి ఈ వేడుక మెగా మెమరబుల్ మూమెంట్ గా నిలిచింది.

Megastar Chiranjeevi Hosts Lavish Party:

Celebrating The Success Of Mana Shankara Vara Prasad Garu

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ