ఆచార్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్ లాంటి ప్లాప్ ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి దర్శకుడు అనిల్ రావిపూడి ఇచ్చిన కాన్ఫిడెంట్ తో మన శంకర వరప్రసాద్ గారు చిత్రంతో సూపర్ హిట్ కొట్టేసారు. ఆకలి మీదున్న మెగా ఫ్యాన్స్ కి బిర్యానీ ఇచ్చినట్టుగా వరప్రసాద్ ని వారికి అప్పజెప్పారు. మన శంకర వరప్రసాద్ గారు చూసాక మెగా ఫ్యాన్స్ ఆకలి తీరిపోయింది.
వరప్రసాద్ గారు హిట్ తో మెగా ఫ్యాన్స్ జోష్ లో ఉన్నారు. ఇలాంటి సమయంలో విశ్వంభర అప్ డేట్స్ ఏమైనా వదిలితే సినిమాకి క్రేజ్ వస్తుంది. గత ఏడాది పోస్ట్ పోన్ అయ్యి ఈ ఏడాది సమ్మర్ కి వెళ్లిన మెగాస్టార్ చిరు-వసిష్ఠ ల విశ్వంభర ను ఇప్పుడు లైన్ లో పెడితే క్రేజ్ పెరుగుతుంది. అసలు విశ్వంభర స్టేటస్ తెలియక మెగా ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు.
అంతేకాదు వాయిదా పడిన విశ్వంభర లో ట్రేడ్ లోను ఆసక్తి తగ్గే ప్రమాదం లేకపోలేదు. సీజీ వర్క్ అంటూ నెలలు తరబడి పోస్ట్ పోన్ చేసిన విశ్వంభర మరుగున పడిపోకుండా వరపసాద్ గారు సక్సెస్ ఊపులో అప్ డేట్స్ వదిలితే బావుంటుంది అని వసిష్ఠ ను మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు, కాదు కాదు వేడుకుంటున్నారు.




అనగనగ ఒక రాజు-పోలిశెట్టి వన్ మ్యాన్ షో
Loading..