ఈవారం మొత్తం సంక్రాంతి సెలవలతో పిల్ల జెల్లా, ఫ్యామిలీస్ అంతా థియేటర్స్ లో ఏయే సినిమాలొస్తున్నాయి, ఓటీటీ లో ఏయే సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయా అని చాలా ఆసక్తితో కనిపిస్తున్నారు. గత వారం విడుదలైన రాజసాబ్ కాస్త నిరాశపరచగా ఈ వారం మెగాస్టార్ మన శంకర వరప్రసాద్ గారు హిట్ టాక్ తెచ్చుకోగా, రవితేజ భర్త మహాశయులకు యావరేజ్ టాక్ పడింది. ఇక ఈ రోజు భోగి సందర్భంగా అనగనగ ఒకరాజు, నారి నారి నడుమ మురారి థియేటర్స్ లో విడుదలవుతున్నాయి. ఈ వారం ఈ నాలుగు సినిమాలతో ప్రేక్షకులు ఫుల్ హ్యాపీ మోడ్ లో కనిపిస్తున్నారు.
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు, వెబ్ సీరీస్ లు
అమెజాన్ ప్రైమ్
బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి (తెలుగు డబ్బింగ్ సినిమా) - జనవరి 12
దండోరా (తెలుగు మూవీ) - జనవరి 14
నెట్ ఫ్లిక్స్
స్ట్రేంజర్ థింగ్స్ 5 (మేకింగ్ వీడియో) - జనవరి 12
తస్కరీ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జనవరి 14
సెవెన్ డయల్స్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 15
ద రిప్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 16
హాట్ స్టార్
ఇండస్ట్రీ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 12
డౌన్ టౌన్ అబ్బే: ద గ్రాండ్ ఫినాలే (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 12
సోనీ లివ్
కాలంకావల్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జనవరి 16
జీ 5
గుర్రం పాపిరెడ్డి (తెలుగు మూవీ) - జనవరి 16
భా భా భా (మలయాళ సినిమా) జనవరి 16
ఆపిల్ టీవీ ప్లస్
హైజాక్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 16




ఆయన లెక్క ప్రకారం అవన్నీ తప్పుడు కలెక్షన్లే
Loading..