అవును గత ఏడాది విడుదల కావాల్సిన ది రాజాసాబ్ నిజంగా లక్కీ గా సంక్రాంతి సీజన్ లో వచ్చి బ్రతికిపోయింది. లేదంటే డిసెంబర్ 5 న విడుదలై ఉంటె ఖచ్చితంగా వర్కౌట్ అయ్యేది కాదు.. కేవలం సంక్రాతి సీజన్ వల్లే సినిమా కి రూ.200 కోట్లు వచ్చాయి. లేదంటే మొదటి రోజుకే రాజసాబ్ దుకాణం సర్దుకోవాల్సి వచ్చేది అంటున్నారు.
కేవలం ప్రభాస్ క్రేజ్, ఆయన స్టామినా నే ఈ రేంజ్ కలెక్షన్స్ రావడానికి కారణమైతే, మరో రీజన్.. సంక్రాంతి సీజన్ అనేది కొంతమంది వాదన. తెలివిగా విశ్వప్రసాద్ బయ్యర్ల మీద పెట్టి బయ్యర్లు సంక్రాంతి సీజన్ అంటున్నారు అంటూ జనవరి 9 కి దించారు కానీ.. లేదంటే డిసెంబర్ 5 గనక సినిమా విడుదలైతే ప్రభాస్ కెరీర్ లో ఈ సినిమా ఎలాంటి స్టేజ్ లో ఉండేదో అని ప్రభాస్ ఫ్యాన్స్ కూడా మాట్లాడుకుంటున్నారు.
అందులోను రాజసాబ్ తర్వాత వచ్చిన సినిమాలు హిట్ అవడం కూడా రాజసాబ్ కి మైనస్ గా మారింది. చిరు మన శంకర వరప్రసాద్ గారు హిట్ అయితే, భర్త మహాశయులకు యావరేజ్ టాక్ పడింది. ఇక మిగతా అనగనగ ఒక రాజు, నారి నారి నడుమ మురారిలు కూడా హిట్ అయితే రాజాసాబ్ పరిస్థితి ఏమవుతుందో చూడాలి.




మారుతి ఈ హారర్ సినిమా చూడాలి
Loading..