టాలీవుడ్ సంక్రాంతి పండుగ సీజన్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటోంది రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ మూవీ. ఈ సినిమా రిలీజైన 4 రోజుల్లో 201 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను వరల్డ్ వైడ్ సొంతం చేసుకుంది. 200 కోట్ల రూపాయల మార్క్ ను కేవలం నాలుగు రోజుల్లో అందుకోవడం రాజా సాబ్ సినిమా జెన్యూన్ సక్సెస్ కు నిదర్శనంగా నిలుస్తోంది. ఫ్యామిలీ ఆడియెన్స్, పిల్లలు మూవీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్ గా యాడ్ చేసిన రాజా సాబ్ ఓల్డ్ గెటప్ సీన్స్ కు కూడా సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.
వర్సటైల్ పర్ ఫార్మెన్స్ తో ప్రభాస్ చేసిన వన్ మ్యాన్ షో, హారర్ ఫాంటసీ జానర్ లో ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేసిన డైరెక్టర్ మారుతి టేకింగ్. అన్ కాంప్రమైజ్డ్ గా గ్లోబల్ సినిమా స్థాయిలో ప్రొడ్యూస్ చేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మేకింగ్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తోంది.
ఆన్ లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్స్ లో రాజా సాబ్ కు భారీగా టికెట్ బుకింగ్స్ జరుగుతున్నాయి. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా ఆకట్టుకుంటున్నారు. ఇదే ట్రెండ్ కొనసాగిస్తూ ఫస్ట్ వీక్ బాక్సాఫీస్ వద్ద హ్యూజ్ నెంబర్ క్రియేట్ చేసేందుకు రాజా సాబ్ రెడీ అవుతోంది.




రాజాసాబ్ 2 ఉంటుందా
Loading..