సెలబ్రిటీలతో డేటింగ్ చేయాలంటే ఏ `యాప్`లోకి వెళ్లాలి? ఈ ప్రశ్నకు సమాధానమిచ్చాడు యజ్వేంద్ర చాహల్. గత ఏడాది అంతా భార్య ధనశ్రీతో విడాకుల టాపిక్ చాహల్ ని మానసికంగా కుంగదీసింది. అయితే అతడు ఇప్పుడు ఒక ఆసక్తికర గుట్టు విప్పాడు. చాహల్ తాను కూడా సెలబ్రిటీ డేటింగ్ యాప్ `రాయా`(Raya)ను ట్రై చేసానని చెప్పాడు. అయితే యాప్ లో ప్రయత్నించాక కొద్ది సేపటికే తిరిగి ప్రొఫైల్ ని డిలీట్ చేసేసానని వెల్లడించాడు. డేటింగ్ యాప్ నియమాలు ఏమిటనేది తనకు అస్సలు అర్థం కాలేదని అన్నాడు. అందుకే తాను యాప్ వదిలేసి బయటపడ్డానని తెలిపాడు. గతంలో జాన్వీ కపూర్, అనన్య పాండే లాంటి నటీమణులు రాయా యాప్ లో ప్రొఫైల్ ఉంచామని వెల్లడించారు.
కెరీర్ పరంగా, వ్యక్తిగత జీవితం పరంగా చాలా ఒత్తిళ్లను ఎదుర్కొన్న క్రికెటర్ చాహల్ తీవ్ర డిప్రెషన్ నుంచి బయటపడేందుకు శిక్షణ తీసుకున్నానని గతంలో చెప్పాడు. ప్రస్తుతం ఆ అధ్యాయం ముగిసింది. కెరీర్ పై శ్రద్ధ పెడుతున్నానని చెప్పాడు. 2026లో ప్రారంభం కానున్న ఐపీఎల్ సిరీస్ పై దృష్టి పెడతానని, టీమిండియాకు వికెట్లు తీయడంపైనే ధ్యాస పెడుతున్నానని తెలిపాడు. తాను ప్రస్తుతం ఒంటరిగానే ఉన్నానని, తనతో కనిపించే మహిళలంతా తన స్నేహితులు మాత్రమేనని క్లారిటీ ఇచ్చాడు. ఆర్జే మహ్వాష్ తో డేటింగ్ ప్రచారాన్ని కూడా చాహల్ ఖండించాడు. తన గురించి తన భార్య గురించి తప్పుడు ప్రచారం చేసేవారికి దానివల్ల కలిగే ఆనందమేమిటో తనకు అర్థం కాలేదని అన్నాడు.




నిన్న అలా - ఈరోజు ఇలా
Loading..