తెలంగాణాలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీపై కక్ష తీర్చుకుంటుంది. ఒకరిని ఒకలా, మరొకరిని మరోలా ట్రీట్ చేస్తుంది అంటూ BRS నేత హారిష్ రావు రేవంత్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రీసెంట్ గా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి తాను చెప్పింది వినడం లేదు, అందుకె నేను ఆ సినిమాటోగ్రఫీ శాఖను పట్టించుకోవడం లేదు, నాకు పెరిగిన సినిమా టికెట్ రేట్లకు సంబంధం లేదు అంటూ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం ప్రతిపక్షానికి బల్లెం లా మారింది.
ఆ విషయమే హరీష్ రావు మట్లాడుతూ..
అసలు సినిమా రంగాన్ని ఒక పరిశ్రమగా చూస్తున్నారా, లేక మీ రాజకీయ కక్షలు తీర్చుకునే అడ్డాగా మార్చుకున్నారా, ఒక సినిమాకేమో(రాజాసాబ్ కి) అర్ధరాత్రి దాకా పర్మిషన్ ఇవ్వరు.. ఇంకో సినిమాకేమో(మన శంకర వరప్రసాద్ గారు) రెండు రోజుల ముందే రాచమర్యాదలతో పర్మిషన్ ఇస్తారు. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అన్నందుకు ఒక హీరో సినిమాపై కక్ష గడతారు.
మీ పేరు మర్చిపోయినందుకు ఇంకో హీరోని(అల్లు అర్జున్) జైలుకు పంపిస్తారు. ఇప్పుడు మీకు నచ్చినోళ్లు అయితే.. రూ. 600 టికెట్ రేటుకి పర్మిషన్ ఇస్తారా.. మొన్న ఎన్నికల్లో ఓడిపోయి.. నేడు రాజ్యాంగేతర శక్తిగా ఎదిగి సినిమా టికెట్ల రేట్లను శాసిస్తున్న ఆ కనిపించని శక్తి ఎవరో? ఒక్కో సినిమాకు కమిషన్ల రూపంలో ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారో?.. ఆ వివరాలన్నీ త్వరలోనే బయటపెడతాం.
సినెమాటోగ్రాఫి శాఖ మంత్రికి తెలియకుండా జరుగుతున్న ఈ సినిమా రేట్ల కమిషన్ల దందాపై గవర్నర్ గారు దృష్టి సారించాలని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని BRS పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అంటూ హరీష్ రావు, రేవంత్ రెడ్డి ప్రభత్వం పై ధ్వజమెత్తారు.

రికార్డ్ క్రియేట్ చేసిన పవన్ కళ్యాణ్
Loading..