టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించిన `బొమ్మరిల్లు` ఎంత పెద్ద సక్సెసైందో తెలిసిందే. ఈ సినిమాతోనే దర్శకుడు భాస్కర్ `బొమ్మరిల్లు` భాస్కర్ గా పాపులరయ్యాడు. సిద్ధార్థ్- జెనీలియా జంటగా నటించిన ఈ చిత్రంలో సిధ్ తండ్రిగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటించారు. కుటుంబాన్ని, కొడుకును అతిగా ప్రేమించే తండ్రిగా ప్రకాష్ రాజ్ నటన, ప్రేమించిన అమ్మాయి కోసం తండ్రిని ఎదురించలేక పాట్లు పడే యువకుడిగా సిద్ధార్థ్ నటన, అల్లరి ప్రేమికురాలిగా జెనీలియా నటనను.. ఎప్పటికీ తెలుగు ప్రజలు మర్చిపోలేరు. అందుకే బొమ్మరిల్లు సీక్వెల్ తెరకెక్కుతోందనే వార్తలకు అభిమానులు ఎక్కువగా ఎగ్జయిట్ అవుతారు.
కానీ దిల్ రాజు ఇప్పటివరకూ అలాంటి ప్రకటన ఏదీ చేయలేదు. కానీ ఇప్పుడు ఆది సాయికుమార్ -సాయికుమార్ ప్రధాన పాత్రల్లో బొమ్మరిల్లు 2 తీయాలి! అంటూ దిల్ రాజు `శంబాల` సక్సెస్ వేదికపై వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. కొడుకు కోసం, కొడుకు సక్సెస్ కోసం తపించే తండ్రిగా సాయికుమార్ ను చూస్తున్నాను. నేను బొమ్మరిల్లు2 తీస్తే ఆది- సాయికుమార్ లను పెట్టి తీయాలి అని దిల్ రాజు అన్నారు. కొడుకు కోసం తపించినా కానీ మొత్తం యూనిట్ కి సాయికుమార్ వెన్నెముకగా ఉన్నారని ప్రశంసించారు. మొత్తానికి తండ్రి కొడుకులు ఆది సాయికుమార్- సాయికుమార్ రియల్ లైఫ్ అనుబంధం దిల్ రాజులో స్ఫూర్తిని నింపింది కాబట్టి, సీక్వెల్ కచ్ఛితంగా తెరకెక్కుతుందనే భావిద్దాం. అయితే ఆది విషయంలో సాయికుమార్ అతిగా కేర్ తీసుకుంటున్నారా?... దాదాపు పదేళ్ల తర్వాత శంబాల` చిత్రంతో విజయం అందుకున్న ఆనందంలో ఉన్నాడు ఆది. ఇదే హుషారులో దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత అతడి కెరీర్ కి ఊతమిస్తే మంచిదేగా!




ప్రమోషన్స్ కన్నా వెకేషన్స్ ముఖ్యమా
Loading..