ఈ సంక్రాంతికి కామెడీ జోనర్ తో ఆడియన్స్ ని నవ్వించేందుకు నవీన్ పోలిశెట్టి రాబోతున్నాడు. జనవరి 14 న అనగనగ ఒక రాజు చిత్రాన్ని విడుదల చెయ్యబోతున్నారు. చిన్న చిత్రంగా కనిపించిన అనగనగ ఒక రాజు సంక్రాంతి బరిలో క్రేజీ ప్రమోషన్స్ తో కాదు కాదు డిఫ్రెంట్ ప్రమోషన్స్ తో దూసుకుపోతుంది. నవీన్ పోలిశెట్టి, హీరోయిన్ మీనాక్షి చౌదరి, నిర్మాత నాగ వంశీ అనగనగ ఒక రాజు ను తెగ ప్రమోట్ చేస్తున్నారు.
రీసెంట్ గానే మల్లారెడ్డి యూనివర్సిటీస్ లో సాంగ్ లంచ్ చెయ్యగా మల్లారెడ్డి కోడలు నవీన్ పోలిశెట్టి తో కలిసి స్టెప్స్ వెయ్యడం అందరిని ఆకర్షించింది. ఇకపోతే రాజు గారి కోసం రాశి దిగింది అనే వార్త వైరల్ గా మారింది. అనగనగ ఒక రాజు చిత్రంలో ఓ స్పెషల్ ఐటెం ని ప్లాన్ చేశారట. అందులో క్రేజీ హీరోయిన్ రాశి ఖన్నా ఆడిపాడింది అని తెలుస్తుంది.
అంటే రాజు గారి కోసం రాశి ఖన్నా దిగింది అన్నమాట. నవీన్ పోలిశెట్టి తో రాశి ఖన్నా వేసిన డాన్స్ స్టెప్స్ అదిరిపోయాయని అంటున్నారు. ఈ సాంగ్ సినిమాకి ఖచ్చితంగా ప్లస్ అవుతుంది అంటున్నారు. ప్రస్తుతం రాశి ఖన్నా హైదరాబాద్ లోనే పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ ఫినిష్ చేసే పనిలో ఉంది.




వృషభ - ఇంతకన్నా అవమానం ఉండదు
Loading..