చాలామంది హీరోస్ అయినా, హీరోయిన్స్ అయినా సినిమాల్లో ఉండే క్రేజ్ తో కొన్ని ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేస్తూ యాడ్స్ షూట్స్ లో రెండు చేతులా సంపాదిస్తారు. స్టార్స్ అందానికి ఆ ప్రోడక్ట్ మెయిన్ సీక్రెట్ అని అభిమానులు ఆ ప్రొడక్షన్ ఎగబడి కొంటారని కోట్లు పెట్టి యాజమాన్యాలు స్టార్స్ ని తీసుకొచ్చి బ్రాండ్ అంబాసిడర్లు గా పెట్టుకుని యాడ్స్ రెడీ చేసి ప్రమోట్ చేసుకుంటారు. అయితే అందులో కొన్ని ప్రొడక్ట్స్ హాని చేసేవిగా ఉంటాయి. అలాంటి వాటిని చాలామంది స్టార్స్ ప్రమోట్ చేసేందుకు మొగ్గు చూపించరు.
కానీ కొంతమంది డబ్బు కు ఆశపడి వాటిని ప్రమోట్ చేసి తర్వాత చిక్కుల్లో పడతారు, తాజాగా బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తను ఓ హానికర ప్రోడక్ట్ ని రిజెక్టు చేసినట్లుగా చెప్పడమే కాదు, ఆ యాడ్ షూట్ లో పాల్గొంటే 40 కోట్ల పారితోషికం ఇస్తాను అన్నా తను దానిని రిజెక్ట్ చేసినట్టుగా చెప్పి షాకిచ్చారు.
అలాంటి యాడ్స్ లో నటిస్తే తన పిల్లలకు తానేమి నేర్పిస్తాను, తన పిల్లలు అహాన్, అతియాకు ఆదర్శంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఆ పొగాకు ఉత్పత్తి యాడ్ ని రిజెక్ట్ చేసినట్లుగా, అలాంటి వాటిలో నటిస్తే.. తన పిల్లలకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని సునీల్ శెట్టి చెప్పారు, మరి ఇలా ఆలోచించే నటులు ఎంతమంది ఉంటారు, నిజంగా సునీల్ శెట్టి గ్రేట్ అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.




అప్పుడు ఎన్టీఆర్ - ఇప్పుడు ప్రభాస్
Loading..