బిగ్ బాస్ సీజన్ 9 లో టాప్ 5 కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన భరణి శంకర్ ఆ తర్వాత బంధాల బావిలో చిక్కుకుని విలవిలలాడడమే కాదు ఎలిమినేట్ అయ్యేవరకు తెచ్చుకున్నాడు. ఆట గట్టిగా ఆడినా భరణి కేవలం బంధాల్లో ఇరుక్కుని బయటికి వెళ్ళొచ్చాడు. వచ్చాక కూడా మళ్లీ మళ్లీ బంధాలలో చిక్కుకున్నాడు.
ఆతర్వాత హెల్త్ ఇష్యుస్ తోనూ భరణి ఇబ్బంది పడ్డాడు, మరోపక్క భరణి కి నాగబాబు సపోర్ట్ ఉంది అందుకే ఆయన్ని గ్యారెంటీగా టాప్ 5కి పంపిస్తారనే ప్రచారం జరిగింది. హౌస్ లో తనూజ తో నాన్న బాండింగ్ దివ్య తో అన్న బాండింగ్ అన్ని భరణి కి భారంగా మారాయి. ఇక సుమన్ శెట్టితో బాగా క్లోజ్ అయిన భరణి డబుల్ ఎలిమినేషన్ లో బెస్ట్ ఫ్రెండ్స్ అయిన సుమన్ శెట్టి-భరణి బ్యాక్ టు బ్యాక్ ఎలిమినేట్ అయ్యారు.
అయితే ఎలిమినేట్ అయ్యి స్టేజ్ పైకి వెళ్ళాక భరణి కొన్నిసార్లు నిన్ను హార్ట్ చేసినా, నాన్న అంటే దూరం పెట్టె దుర్మార్గుడిని కాదు అంటూ తనూజ తో అన్న భరణి సుమన్ శెట్టి, తనూజ, దివ్యలు తనకు బెస్టిస్ అన్నాడు. కళ్యాణ్ ను నేను ఎప్పుడు నామినేట్ చెయ్యలేదు, అతను కప్పు కొట్టే కెపాసిటీ ఉంది అన్నారు. ఇక తనూజ భరణి వెళ్లిపోతుంటే భరణి ఆశీర్వాదం తీసుకోవడం హైలెట్ అయ్యింది.




అఖండ 2 కి సిసలు అగ్నిపరీక్ష
Loading..