కాంతార బ్యూటీ తన హిందీ కనెక్షన్ గురించి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడింది. తన తండ్రి ఆర్మీ అధికారి కావడంతో కంటోన్మెంట్లు మారుతూ విధి నిర్వహణ స్థలం మారేది. అయితే ఒక కంటోన్మెంట్ ని ఇంకో కంటోన్మెంట్ తో కలిపి ఉంచేది హిందీ భాష. అందుకే ఆ భాషలో తనకు గొప్ప ప్రావీణ్యం ఉందని తెలిపింది రుక్మిణి. తన బలమైన ఆర్మీ నేపథ్యం కారణంగానే హిందీ భాషతో సమస్యలేవీ లేవని అంగీకరించింది.
తండ్రి భారత సైన్యంలో సేవలందించగా, కుమార్తె సినీ పరిశ్రమలో రాణిస్తోంది. రుక్మిణి వసంత్ ఒక క్రమశిక్షణ కలిగిన కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్ భారత సైన్యంలో ఒక ధైర్యవంతుడైన అధికారి. అశోక చక్ర పురస్కారం పొందిన కర్ణాటకకు చెందిన మొదటి సైనికుడు. ఆయన 2007లో జమ్మూ కాశ్మీర్‌లోని `యూరి`లో విధి నిర్వహణలో ఉండగా మరణించారు. ఆమె తండ్రి ధైర్యం, క్రమశిక్షణ రుక్మిణి వ్యక్తిత్వాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. ఆమె తల్లి సుభాషిణి వసంత్ ఒక ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి. తరువాత సైనిక వితంతువుల కోసం పనిచేసే ఒక సంస్థలో చేరారు. కళారంగంలో రుక్మిణి ప్రస్తుతం హవా సాగిస్తోంది. తెలుగు, తమిళ సినిమాలతో పాటు కన్నడం, హిందీలోను నటిస్తోంది. త్వరలోనే తన బాలీవుడ్ డ్రీమ్స్ ని నిజం చేసుకుంటానని, హిందీ భాషపై పట్టు ఉంది గనుక ఈ పరిశ్రమలోను రాణిస్తానని నమ్మకాన్ని వ్యక్తం చేసింది. రుక్మిణి ఇటీవల పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కాంతార చాప్టర్ 1లో నటించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ -డ్రాగన్ లో నటిస్తోంది. అలాగే మణిరత్నం చిత్రంలోను అవకాశం అందుకుంది. యష్ సరసన నటించిన టాక్సిక్ విడుదల కావాల్సి ఉంది.




మంత్రి అవ్వకుండానే ముగింపు
Loading..