మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ మాస్-అండ్-ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు. బ్లాక్‌బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్, దూకుడుగా సాగుతున్న ప్రచార కార్యక్రమాలతో సంచలనం సృష్టిస్తోంది. విక్టరీ వెంకటేష్ కీలకమైన ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం నుంచి వెంకీ బర్త్ డే సందర్భంగా స్టైలిష్ లుక్ వదిలారు మేకర్స్.
మన శంకర వర ప్రసాద్ గారు పూర్తి షూటింగ్ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులను వేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రం సంక్రాంతికి కేవలం 2 రోజుల ముందు, జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది. సోమవారం విడుదల కావడం వల్ల, ఈ చిత్రం ఏడు రోజుల లాంగ్ వీకెండ్ బెనిఫిట్ పొందుతుంది. పండుగ సెలవుల పూర్తిగా కలిసిరానున్నాయి. మంచి ప్లానింగ్ తో చేసిన రిలీజ్ టైం సంక్రాంతి సీజన్‌లో బాక్సాఫీస్ వద్ద సినిమాకు బలమైన వసూళ్లను అందించి, ప్రేక్షకుల రష్ ని గరిష్ఠంగా పెంచుతుందని భావిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి యంగ్ అండ్ డైమనిక్ గా కనిపించిన రిలీజ్ డేట్ పోస్టర్ అదిరిపోయింది. రెడ్ కార్ పై బ్లాక్ సూట్ లో కాఫీ సిప్ చేస్తూ మెగా స్వాగ్ తో మెస్మరైజ్ చేశారు చిరంజీవి.




BB9: ఈ వారమంతా డిమోన్ పవన్ దే
Loading..