ఆర్జీవీని తలుచుకోగానే వివాదాలే మొదటగా గుర్తుకు వస్తాయి. ఏదో ఒక వివాదం రాజేసి, దానిని ఎంజాయ్ చేయడం ఆయన స్వభావం. అయితే ఫిలాసఫీ, సైకాలజీపై పుస్తకాలు ఎక్కువగా చదివే అలవాటు ఉన్న ఆర్జీవీ అలియాస్ రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా అది కొత్తగా ఉంటుంది. జమానా కాలంలోనే ఆంగ్ల భాషపై గొప్ప పట్టు సంపాదించిన ఆర్జీవీ, తన లైఫ్ లో ఎన్నో పుస్తకాలు చదివి అపారజ్ఞానం సాముపార్జించారు. అందుకే సామాన్యులకు అతడు మాట్లాడే ప్రతి మాటా తిరకాసులా వినిపిస్తుంది. రెగ్యులర్ సమాజానికి అతడు అంత తేలిగ్గా అర్థం కాని ఒక ఫజిల్.
ఒక వ్యవస్థ.. దాని చుట్టూ ఉండే రూల్స్ ని అనుసరించే సాధారణ ప్రజలతో పోలిస్తే చాలా భిన్నంగా ఆలోచించగల సామర్థ్యం రామూకి ఉంది. అందుకే రామూయిజానికి ప్రత్యేకించి ఫాలోయింగ్ ఉంది. ఒక దర్శకుడిగా ఇతరుల కంటే భిన్నమైన , అడ్వాన్స్ డ్ సినిమాలను తీయగలిగిన మేధోతనం రామ్ గోపాల్ వర్మలోనే చూడగలం. ఇటీవల అతడు తన ఆలోచనల పరిధిలో సినిమాలు తీయకపోవడం అభిమానులను నిరాశపరుస్తున్నా కానీ, ఇప్పటికీ రామూయిజాన్ని ఆస్వాధించేవాళ్లు లేకపోలేదు.
ముఖ్యంగా అతడు యూట్యూబ్ ఇంటర్వ్యూలు, పాడ్ కాస్ట్ లలో రామూయిజాన్ని జనాల్లోకి పంపిణీ చేసిన విధానం నిజంగా గొప్ప ఆదరణ దక్కించుకుంది. ఇక యూట్యూబ్ లో రామూయిజాన్ని అనుసరించే వాళ్లలో అక్కినేని కోడలు శోభిత ధూళిపాల ఒకరు. సైకలాజికల్ గా, ఫిలసఫికల్ గా రామ్ గోపాల్ వర్మ విశ్లేషణలకు వీరాభిమాని శోభిత. అందుకే తన ఆల్ టైమ్ ఆసక్తులలో కచ్ఛితంగా `రామూయిజం` కూడా ఉందని తాజా ఇంటర్వ్యూలో శోభిత వెల్లడించారు. నిజానికి శోభిత ధూళిపాల కూడా ఉన్నత విద్యావంతురాలు. కార్పొరెట్ లా, కామర్స్, ఎకనామిక్స్ లో డిగ్రీ పట్టా అందుకున్నారు. అందుకే తన ఆలోచనలు, ఐక్యూ లెవల్ కూడా రొటీన్ తెలుగమ్మాయిలకు భిన్నం. శోభిత సినిమా కథలు, పాత్రలు ఎంపిక కూడా విభిన్నమైనవి. ఇప్పుడు అక్కినేని కోడలు అయ్యాక కూడా శోభిత నటనలో తన కెరీర్ ని కొనసాగిస్తున్నారు. వైవిధ్యమైన వెబ్ సిరీస్ లు, సినిమాల్లో నటించేందుకు ఆసక్తిగా ఉన్నారు. భవిష్యత్ లో నటిగా మరిన్ని ప్రయోగాలకు శ్రీకారం చుట్టనున్నారని సమాచారం.




వారణాసి ఓటీటీ డీల్ అన్ని కోట్లా .. 
Loading..