అక్కినేని నాగచైతన్య, సమంత జంట ప్రేమ పెళ్లి చివరికి విడాకులతో ముగియడం అభిమానులు ఎప్పటికీ జీర్ణించుకోలేనిది. కానీ విధిని ఎవరూ మార్చలేరు. ప్రస్తుతం ఆ ఇద్దరూ ఎవరి దారిలో వారున్నారు. నాగచైతన్య అందాల కథానాయిక, తెలుగమ్మాయి శోభిత ధూళిపాలను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. సామ్ ప్రస్తుతం కెరీర్ పై దృష్టి సారించింది.
తాజాగా ఎన్డీటీవీ పాడ్ కాస్ట్ లో సమంత, చైతూ మధ్య వైరుధ్యాల గురించి అమల అక్కినేని స్పష్ఠంగా మాట్లాడారు. నాగచైతన్య బాల్యంలో చెన్నైలో తన తల్లి వద్ద పెరిగారు. కాలేజ్ చదువుల కోసం హైదరాబాద్ కి వచ్చాడు. అతడు తనకు ముందే తెలిసినా కానీ, హైదరాబాద్ కి వచ్చాకే బాగా అర్థమయ్యాడని అమల తెలిపారు. చైతన్య మంచి యువకుడు. తెలివైన వాడు. మృధువైన వాడు. తండ్రి మాట జవదాటని వాడు. సొంత ఆలోచనలు తెలివితేటలు ఉన్న యువకుడు. అయితే రెండు కుటుంబాల మధ్య అతడి బాల్యం గడిచిందని తెలిపారు.
అయితే నెటిజనులు దీనికి ప్రతి స్పందిస్తూ,... అది అతడి బాల్యంలో ఎమోషనల్ గ్లిచ్. అతడు పెరిగి పెద్దవాడయ్యాక, ఒక అందమైన ప్రేమగల స్థిరమైన కుటుంబాన్ని సృష్టించాలని ఆశపడ్డాడు. కానీ సమంత తన కెరీర్ పై దృష్టి సారించారు. కనీసం శోభిత అతడిలో ఆ భాగాన్ని అర్థం చేసుకోవాలని, స్థిరమైన కుటుంబం కోసం సహకరించాలని నెటిజనులు కోరారు. చైతన్య.. శోభితను పెళ్లాడాక చాలా సంతోషంగా ఉన్నాడు. ఇటీవల కెరీర్ పై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన సంగతి తెలిసిందే.




అఖండ2: బాలయ్యకు కళ్ళు చెదిరే పారితోషికం
Loading..