తెలుగు దేశం పార్టీలో ఇప్పుడు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తర్వాత అంత స్ట్రాంగ్ పర్సన్ ఎవరు అంటే నారా లోకేష్ పేరే వినిపిస్తుంది. లోకేష్ బాబు గారి కొడుకు అనో, లేదంటే మరేదన్నానో కాదు, నారా లోకేష్ యువగళం పాదయాత్ర నుంచే యువతలో తనపై స్ట్రాంగ్ ఒపీనియన్ వచ్చేలా చెయ్యడంలో అడుగడుగునా సక్సెస్ అవ్వడమే కాదు 2024 ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు.
తండ్రికి తగ్గ తనయుడిగా, మంత్రిగా ఏపీ రాజకీయాల్లో లోకేష్ తనదైన ప్రత్యేకతను చూపిస్తున్నారు. ఇక మంగళగిరి నియోజకవర్గంలో ప్రజా దర్బార్ పేరిట ప్రజల సమస్యలను తెలుసుకుని సంబంధింత అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి తగిన కృషి చేస్తున్న లోకేష్ అంటే ఏపీ ప్రజల్లో ఎంతో నమ్మకం, ఎన్నోఆశలు ఉన్నాయి.
అటు తెలుగు దేశం కార్యకర్తల్లోనూ నారా లోకేష్ పై విపరీతమైన నమ్మకం, ఆయన తో తమ సమస్యలను చెప్పుకుంటే అది నెరవేరుతుంది అని బలంగా నమ్ముతారు. ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద మంత్రి లోకేష్ కు వినతి పత్రం ఇవ్వాలని కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. నారా లోకేష్ ని కలిసి తమ సమస్యలు గురించి చెప్పాలని.. ఉదయం నుoచి భారీగా తరలి వచ్చిన టీడీపీ కార్యకర్తలు.. కార్యకర్తల సమస్యల వినతి పత్రాలను స్వయంగా లోకేష్ కు ఇచ్చేందుకు క్యూ లైన్ లో నిలబడి ఉన్నారు కార్యకర్తలు.
నారా లోకేష్ వచ్చి కలిసి తమ సమస్యలు పరిష్కరిస్తారని వారు ఎదురు చూస్తున్నారు.




రాజా సాబ్ అమెరికా ప్లాన్స్ 
Loading..