Advertisementt

మోస్ట్ స్టైలిష్ క్లైమాక్స్ ఫైట్ లో చిరు

Sun 02nd Nov 2025 06:38 PM
chiranjeevi  మోస్ట్ స్టైలిష్ క్లైమాక్స్ ఫైట్ లో చిరు
Mana Shankara Vara Prasad Garu Most Stylish Climax Fight Shoot మోస్ట్ స్టైలిష్ క్లైమాక్స్ ఫైట్ లో చిరు
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. వెంకటేష్ ఇటీవలే ఈ సెట్ లో జాయిన్ అయ్యారు. షైన్ స్క్రీన్స్,  గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు.

ఈరోజు నుండి చిరంజీవి గారు, ఫైటర్స్ బృందం పాల్గొనే స్టైలిష్ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌ను హైదరాబాద్‌లో చిత్రీకరించడం ప్రారంభించారు. ఇది ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా విజువల్‌గా అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ వెంకట్‌ మాస్టర్‌ పర్యవేక్షణలో ప్రతి సన్నివేశం గ్రాండ్ గా రూపొందుతోంది. చిరంజీవి గారి చరిష్మా, గ్రేస్, అనిల్‌ రావిపూడి టచ్‌ కలిసిన ఈ క్లైమాక్స్‌ సీక్వెన్స్‌ ప్రేక్షకులకు మరిచిపోలేని అనుభూతిని అందించనుంది. ప్రస్తుతం చిత్ర నిర్మాణ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి.

ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, వి.టి.వి. గణేష్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. 2026 సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ గా ప్రేక్షకులు ముందుకు రానుంది.

Mana Shankara Vara Prasad Garu Most Stylish Climax Fight Shoot :

Chiranjeevi Mana Shankara Vara Prasad Garu Most Stylish Climax Fight Shoot In Hyderabad

Tags:   CHIRANJEEVI
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ