మటన్ సూప్ రివ్యూ.. ఆకట్టుకునే క్రైమ్ కథ
బ్యానర్స్ - అలుకా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్
నటీనటులు - రమణ్, వర్ష విశ్వనాథ్, జెమినీ సురేష్, గోవింద్ శ్రీనివాస్, శివరాజ్, ఎస్ఆర్‌కే, చరణ్, కిరణ్, గోపాల్ మహర్షి, సునీత మనోహర్, మాస్టర్ విహార్, కిరణ్ మేడసాని తదితరులు
రచన, దర్శకత్వం - రామచంద్ర వట్టికూటి
నిర్మాతలు - మల్లిఖార్జున ఎలికా (గోపాల్), అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల
కెమెరామెన్ : భరద్వాజ్, ఫణింద్ర
మ్యూజిక్ : వెంకీ వీణ
ఎడిటింగ్ : లోకేష్ కడలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పర్వతనేని రాంబాబు
నిజ ఘటన ఆధారంగా తీసిన సినిమా మటన్ సూప్. ఇప్పటికే టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. డిఫరెంట్ టైటిల్‌తో డైరెక్టర్ రామచంద్ర వట్టికూటి ఈ సినిమాలో ఏం చూపించాడు? ఎలా తెరకెక్కించాడు? ఈ చిత్రం ఆడియన్స్‌కి ఏ మేరకు ఆకట్టుకుంటుంది? అన్నది చూద్దాం.
కథ
శ్రీరాం (రమణ్) ఫైనాన్స్ బిజినెస్ చేస్తుంటాడు. డబ్బులు ఇవ్వడం, వాటిని నిర్దాక్షిణ్యంగా వసూల్ చేయడం వంటివి చేస్తుంటాడు. దీంతో అతడికి సహజంగానే శత్రువులు ఎక్కువగా పుడుతూ ఉంటారు. అతని పార్ట్‌నర్‌తో కలిసి చేసే ఆ వ్యాపారం వల్ల చాలా శ్రీరాంకు సమస్యలు వస్తుంటాయి. ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన సత్యభామ (వర్ష విశ్వనాథ్)ను శ్రీరాం ప్రేమిస్తాడు. వీరిద్దరూ ప్రేమికుల రోజున పార్క్‌లో ఉండటం, గజగంగ్ దళ్ చూడటం.. అలా అక్కడే ఆ ఇద్దరికీ పెళ్లి చేయడం జరుగుతుంది. ఈ పెళ్లిని శ్రీరాం ఇంటి సభ్యులకు ఇష్టం ఉండదు. ఆ తరువాత శ్రీరాం వేరు కాపురం పెడతాడు.
అంతా బాగుందని అనుకుంటున్న తరుణంలో శ్రీరాంపై కొందరు దాడి చేస్తారు. మొహంపై యాసిడ్ పోయటంతో మొత్తం కాలిపోతుంది. దీంతో శ్రీరాం హాస్పిటల్ పాలవుతాడు. శ్రీరాంను సత్య ఎంతో ప్రేమగా, జాగ్రత్తగా చూసుకుంటుంటుంది. శ్రీరాంకి దగ్గరి బంధువైన శివరాం(జెమినీ సురేష్) ఈ దాడి మీద విచారణ చేస్తుంటాడు. అసలు దాడి ఎలా జరిగింది? ఎవరు చేశారు? అనే దానిపై ఆరా తీస్తుంటాడు. ఇంతకీ శ్రీరాంపై దాడి చేసిందెవరు? కృష్ణకు శ్రీరాంకు ఉన్న సంబంధం ఏంటి? అసలు శ్రీరాం తల్లికి వచ్చే అనుమానం ఏంటి? అనే విషయాలు తెలియాలంటే థియేటర్లకు వెళ్లాల్సిందే.
ఈ మధ్య సమాజంలో సినిమాల్లో కంటే ఎక్కువగా క్రైమ్స్, రకరకాల పద్దతుల్లో నేరాలు జరుగుతున్నాయి. అలా సమాజాన్ని ఆశ్చర్యపరిచన ఓ కేసుని తీసుకుని దర్శకుడు ఈ మటన్ సూప్ చిత్రాన్ని తెరకెక్కించాడు. డైరెక్టర్ రామచంద్ర వట్టికూటి ఎంచుకున్నఈ క్రైమ్ కథను తెరపై బాగానే ఆవిష్కరించాడు. ఇలాంటి క్రైమ్ కథల్లో ఉండే ట్విస్ట్‌లు చాలా ఇంపార్టెంట్. అయితే ఇది బయట జరిగిన ఘటనే కాబట్టి క్లైమాక్స్ ఏంటో అందరికీ ముందే తెలుస్తుంది. అయినా కూడా ఇంట్రెస్టింగ్ చెప్పడం, సీటులో కూర్చునేలా చేయడంలో దర్శకుడు సఫలం అయ్యాడని చెప్పుకోవచ్చు.
ఇంట్రెస్టింగ్‌గా సన్నివేశాలను రాసుకున్న తీరు అందరినీ ఆట్టుకుంటుంది. మరింత బడ్జెట్ ఉంటే ఇంకో లెవెల్లో సినిమా వచ్చి ఉండేదేమో. తనకున్న వనరులను, ఫైనాన్సియల్ సిట్యువేషన్స్‌ను బేస్ చేసుకుని మటన్ సూప్ ను చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్‌లో బిల్డ్ చేసిన స్టోరీ.. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్ట్, క్లైమాక్స్ సినిమాలో ఆకట్టుకునే అంశాలుగా చెప్పుకోవచ్చు.
ఇక నటీనటులు విషయానికి వస్తే.. రమణ్ ఇందులో రెండు పాత్రల్లో నటించి మెప్పించాడు. గత చిత్రంతో పోల్చుకుంటే ఈ సినిమాలో నటన పరంగా తను మెరుగైనట్టుగా కనిపిస్తాడు. హీరోయిన్ వర్ష విశ్వనాథ్ చూడటానికి బాగానే ఉంది కానీ.. నటిగా ఇంకాస్త ఇంప్రూవ్ కావాల్సి ఉందనిపిస్తుంది. జెమినీ సురేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చక్కగా నటించాడు. యాక్టర్ గోవింద్ బాగా పర్ఫామ్ చేశాడు. గోపాల్ మహర్షి, కిరణ్ మేడసాని సహా మిగిలిన నటీనటులు వారి పాత్రల పరిధి మేరకు నటించారు.
భరద్వాజ్, ఫణీంద్ కెమెరా వర్క్, వెంకీ వేణు సంగీతం సినిమాకు ప్రధాన బలం. దర్శకుడు సినిమాలో క్రైమ్ పాయింట్‌ను తెరకెక్కించిన విధానం, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో అసలేం జరిగిందనే విషయాలను రివీల్ చేసిన తీరు, ఆ స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. అయితే ఇంకాస్త ఎంగేజింగ్‌గా చేసుంటే ఫలితం వేరేలా ఉండేదేమో. సెకండాప్ ఉన్నంత గ్రిప్పింగ్‌గా ఫస్టాఫ్ ఉండకపోవడం మైనస్ అని చెప్పుకోవచ్చు. ఎడిటర్ ఇంకాస్త తన కత్తెరకు పని చెప్పుంటే బావుండేది. మొత్తాన్ని మటన్ సూప్ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా ఓ సెక్షన్‌ను ఆకట్టుకుంటుంది.
రేటింగ్ -2.5