బలగం చిత్రంతో దర్శకుడిగా బలమైన పునాదులు వేసుకున్న వేణు కి ఆ తర్వాత ప్రాజెక్ట్ మొదలు పెట్టేందుకు అనేక విగ్నాలు ఎదురవుతూనే ఉన్నాయి. బలగం తర్వాత అదే దిల్ రాజు బ్యానర్ లో నాని హీరోగా ఎల్లమ్మ చిత్రాన్ని అనౌన్స్ చేసాడు వేణు. కానీ నాని ఎల్లమ్మ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేసిన కొన్ని నెలలకు ఆ ప్రోజెక్టు నుంచి తప్పుకున్నాడు.
ఆతర్వాత ఎల్లమ్మ ప్రాజెక్ట్ లోకి హీరో నితిన్ వచ్చాడు. దిల్ రాజు బ్యానర్ లో తమ్ముడు చిత్రాన్ని చేసిన నితిన్ ని హీరోగా పెట్టి వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ చిత్రాన్ని తెరకెక్కించాలని దిల్ రాజు అనుకున్నారు. కట్ చేస్తే తమ్ముడు అట్టర్ ప్లాప్ అవడంతో.. ఎల్లమ్మ ప్రాజెక్ట్ పై మరోమారు నీలి నీడలు అలుముకున్నాయి.
ఇప్పుడు వేణు ఎల్లమ్మ ప్రాజెక్ట్ మరో హీరో చేతిలోకి వెళ్ళింది అనే వార్త మాత్రం మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది హీరో శర్వానంద్ వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ ప్రాజెక్ట్ లో నటించబోతున్నాడనే వార్త వినిపిస్తుంది. అది చూసి ఎల్లమ్మ ప్రాజెక్ట్ ఎంతమంది హీరోలు చేతులు మారుతుందో అంటూ కామెంట్ చేస్తున్నారు.