ఇప్పటివరకు హను రాఘవపూడి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ(వర్కింగ్ టైటిల్) చిత్రానికి సంబందించిన ఎలాంటి అప్ డేట్ మేకర్స్ ఇప్పటివరకు వదల్లేదు. కేవలం ఫౌజీ ఓపెనింగ్ హడావిడి తప్ప మరె ఇతర విషయాలు ఫౌజీ గురించి కనిపించలేదు. తాజాగా ఫౌజీ షూటింగ్ కి సంబందించి అప్ డేట్ చూస్తే అభిమానులు షాకైపోతారు.
ప్రభాస్ సైలెంట్ గా ఫౌజీ కి సంబందించిన 50 శాతం షూటింగ్ పూర్తి చెయ్యడమేకాదు.. ప్రభాస్ పాత్రకు సంబంధించి మరో 30 రోజులు డేట్స్ ఇస్తే ఫౌజీషూటింగ్ పూర్తవుతుందట. రాజా సాబ్, ఫౌజీ షూటింగ్స్ ను పారలల్ గా చేస్తున్నారు ప్రభాస్. ఈ ఏడాది ఫౌజీ షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిష్ అవుతుంది అని.. ప్రభాస్ ముప్పై రోజుల షూటింగ్ అయ్యాక మిగతా నటులతో కొద్దిమేర షూటింగ్ చేస్తే సినిమా మొత్తం ఓ కొలిక్కి వస్తుందట.
ఆ 30 రోజుల కాల్షీట్స్ లో భారీ యాక్షన్ సన్నివేశాలను హను రాఘవపూడి తెరకెక్కిస్తారని, ఫౌజీ కి ఆ యాక్షన్ సీక్వెన్స్ హైలెట్ అవుతుంది అంటున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వి నటిస్తుంది. ప్రభాస్-ఇమాన్వి కలయికలో వచ్చే రొమాంటిక్ సీన్స్ కూడా హైలెట్ అవుతాయని తెలుస్తోంది.