Advertisementt

వార్ 2 క్లైమాక్స్‌లో ఊహించ‌ని ట్విస్ట్

Fri 08th Aug 2025 09:27 AM
war2  వార్ 2 క్లైమాక్స్‌లో ఊహించ‌ని ట్విస్ట్
Big Twist in war2 climax వార్ 2 క్లైమాక్స్‌లో ఊహించ‌ని ట్విస్ట్
Advertisement
Ads by CJ

స్వాతంత్య్ర దినోత్స‌వ వీకెండ్ లో `వార్ 2` ట్రీట్ కోసం అభిమానులు ఉత్కంఠ‌గా వేచి చూస్తున్నారు. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ యాక్షన్ చిత్రాలలో ఒకటిగా ఇప్పటికే ప్రచారంలో ఉన్న ఈ సినిమా ఆగ‌స్టు 14న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా విడుద‌లవుతోంది. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన ఈ సినిమా వైఆర్ఎఫ్‌ స్పై యూనివర్స్‌లో 2 గంటల 53 నిమిషాల రన్‌టైమ్‌తో అత్యంత సుదీర్ఘ నిడివితో వ‌స్తోంది. సీబీఎఫ్‌సి యుఏ స‌ర్టిఫికెట్ తో గౌర‌వించింది. అయితే 173 ని.ల నిడివితో ఉన్న ఈ సినిమా క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ ఊహించ‌ని విధంగా ఉంటుంద‌ని గుస‌గుస వినిపిస్తోంది. అంతేకాదు.. ఒక సీక్రెట్ క్లైమాక్స్ -క్రెడిట్ సీక్వెన్స్ ని విడిగా సర్టిఫై చేస్తార‌ని కూడా తెలుస్తోంది. దీనిని బ‌ట్టి ఇది ఎంత‌టి కీల‌క‌మైన బోన‌స్ సీన్ అన్న‌ది ఊహించాలని బాలీవుడ్ మీడియా క‌థ‌నాలు వండి వారుస్తోంది.

 

పఠాన్, టైగర్ 3 లాగానే పోస్ట్ క్రెడిట్ సీక్వెన్స్ సినిమాటిక్ విశ్వాన్ని విస్తరించడానికి రూపొందించార‌ని కూడా గుస‌గుస వినిపిస్తోంది. తాజా క‌థ‌నాల ప్ర‌కారం.. ఈ సీక్వెన్స్ కేవలం టీజ్ చేయ‌డానికి కాదు.. ఇది YRF స్పైవర్స్  భవిష్యత్తు ప్ర‌ణాళిక‌ల్ని నిర్ధారిస్తుంది. అతిథులుగా షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అలియా భట్, శార్వరి వంటి పేర్లు వినిపిస్తున్నాయి. ఆలియా, శార్వ‌రి ఇప్ప‌టికే స్పై వ‌ర్స్ మూవీ `ఆల్ఫా`లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

 

తాజా ప‌రిణామాల‌ను బ‌ట్టి వైఆర్ఎఫ్ కొత్త త‌రం ఏజెంట్ల‌ను త‌యారు చేయ‌డంలో నిరంత‌రం బిజీ బీజీగా ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. వార్ 2 ని కూడా ఇప్పుడు ఈ ప‌నికి ఉప‌యోగించుకుంటోంది. అంతేకాదు `వార్ 2`తో ధూమ్ ఫ్రాంచైజ్ ని తిరిగి రీబూట్ చేస్తున్నామ‌ని చెప్ప‌డం వారి ముఖ్య ఉద్ధేశం అని కూడా చెబుతున్నారు. ధూమ్ ఫ్రాంఛైజీని కూడా ఇప్పుడు స్పైవర్స్‌లో కలిపే అవకాశం ఉందని కూడా ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే అధికారికంగా ఇంకా ఏదీ ధృవీకరించలేదు.. కానీ వైఆర్ఎఫ్ మైండ్ లో ఏదో ఉంది. దానివెన‌క అస‌లు ర‌హ‌స్యం ఒకే ఇంటర్‌కనెక్టడ్ విశ్వంలోకి క‌నెక్ట్ చేయ‌డం ద్వారా ఎంసియు త‌ర‌హా ప్ర‌ణాళిక‌ల్ని విస్త‌రిస్తోంద‌ని నిపుణులు ఊహిస్తున్నారు.

Big Twist in war2 climax:

Unpredictable Twist in war2 climax

Tags:   WAR2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ