కొద్దిరోజులుగా మిల్కి బ్యూటీ తమన్నా గ్లామర్ షో వేరే లెవల్ అన్న రీతిలో మొదలు పెట్టింది. అంతకుముందు కూడా తమన్నా గ్లామర్ షో చేసినా తమన్నా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఇంకాస్త అందాలు ఆరబొయ్యడం ఎక్కువ చేసింది. విజయ్ వర్మ తో లవ్ బ్రేకప్ తరవాత తమన్నా.. ప్రస్తుతం తన షూటింగ్స్ తో బిజీ అయ్యింది.
సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోస్ వదిలే తమన్నా భాటియా తాజాగా వదిలిన పిక్స్ చూస్తే మతి పోవాల్సిందే. అందమైన తెల్లటి విగ్రహానికి మోడ్రెన్ డ్రెస్ వేసినట్టుగా పోతపోసిన శిల్పంలా తమన్నా అద్భుతంగా కనిపించింది.
లూజ్ హెయిర్ అందుకు తగిన ఫ్లోరల్ ప్రింట్ కాస్ట్యూమ్ తో తమన్నా చాలా గ్లామర్ గా కనిపించింది. ప్రస్తుతం సౌత్ సినిమాలకు తమన్నా ప్రస్తుతం ఎక్కువగా ముంబై లోనే కనిపిస్తుంది. సౌత్ అవకాశాలు కూడా తమన్నా కు తగ్గాయనే చెప్పాలి. ఆమె ఓదెల 2 తర్వాత హైదరాబాద్ లో కనిపించింది లేదు.