#War 2 మూవీకి సంబందించి 25వ నెంబర్‌కి ఓ ప్రత్యేకత ఉంది. భారతీయ సినీ ఇండస్ట్రీలో ఇద్దరు గొప్ప స్టార్స్ అయిన హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌లను ఒకే సినిమాలో నటింపజేసే అపూర్వ అవకాశాన్ని నిర్మాత ఆదిత్య చోప్రా సాధించారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ రూపొందిస్తోన్న ప్రెస్టీజియస్ స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతున్న WAR 2ను అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఇద్దరూ ఈ సంవత్సరం తమ సినీ ప్రయాణంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారన్నది ఒక అద్భుతమైన విషయం. ఇది యాదృచ్చికంగా జరిగినప్పటికీ ఈ ప్రత్యేక సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవటానికి యశ్ రాజ్ ఫిల్మ్స్ (YRF) ఈ ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా WAR 2 ట్రైలర్‌ను జూలై 25న విడుదల చేస్తుంది.
ఇండియన్ సినీ ఇండస్ట్రీకి హృతిక్ రోషన్, ఎన్టీఆర్ చేసిన గొప్ప సేవలను అభినందిస్తూ యశ్ రాజ్ ఫిల్మ్స్ వార్ 2 మూవీ ట్రైలర్ లాంచ్ ప్రకటనను విడుదల చేసింది. 2025లో ఇండియన్ సినీ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు గొప్ప స్టార్స్, వీరు తమ సినీ ప్రయాణంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. ఇదొక లైఫ్ టైమ్ మూమెంట్స్. ఈ అరుదైన క్షణాలను మరింత గొప్పగా సెలబ్రేట్ చేసుకోవటానికి జూలై 25న WAR 2 ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు యశ్ రాజ్ ఫిల్మ్స్ తెలియజేస్తోంది. ఇది ఇద్దరి గొప్ప స్టార్స్ మధ్య జరిగే అద్భుత పోరాటం! జూలై 25 తేదీని మీ క్యాలెండర్‌లో ప్రత్యేకంగా మార్క్ చేసుకోండి’’ అని సంస్థ పేర్కొంది.
వార్ 2 సినిమా హిందీ, తెలుగు, తమిల, భాషల్లో ఆగస్ట్ 14న ప్రపంచ వ్యాప్తంగా బారీగా విడుదలవుతుంది. ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది.