ప్రియానిక్ జంట రొమాంటిక్ లైఫ్ ఎప్పుడూ బహిరంగమే. ప్రయివేట్ లైఫ్ విషయంలోను ఎలాంటి దాపరికమూ లేదు. పబ్లిక్ వేదికలపై ఘాఢమైన చుంబనాలు లాగించేసినా, హగ్గులు, సరసాలతో రెచ్చిపోయినా ఈ జంటకే చెల్లింది. ఇంతకుముందు ఓ క్రూయిజ్ పార్టీలో పీసీ తన భర్త నిక్‌తో ఎంతో స్వేచ్ఛగా పెగ్గేస్తూ, సిగరెట్లు తాగుతున్న ఫోటోలు వీడియోలు వైరల్ అయ్యాయి. పీసీ స్వేచ్ఛ గురించి అప్పట్లోనే చాలా చర్చ సాగింది.
అమెరికన్ కల్చర్ ని నిక్ నుంచి అడాప్ట్ చేసుకుంది! అంటూ పీసీపై విమర్శలొచ్చాయి. అయితే భారతీయుల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా కానీ ప్రియాంక చోప్రా వాటిని పట్టించుకునే పరిస్థితిలో లేదు. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోషూట్ దీనిని మరోసారి ప్రూవ్ చేసింది.
ఈ ఫోటోషూట్ లో ఒక ప్రత్యేకమైన ఫోటోగ్రాఫ్ అన్ని సందేహాల్ని పటాపంచలు చేసింది. పీసీ స్వేచ్ఛా జీవనాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే అది వారి తప్పు. తను భర్తతో స్వేచ్ఛగా ఆస్వాధనల్లో మునిగి తేలడానికి తనకు హక్కు ఉంది. అయినా ఒకరి వ్యక్తిగత జీవితాన్ని ప్రశ్నించడానికి మీరు ఎవరు? ప్రస్తుతం బికినీ బీచ్ సెలబ్రేషన్స్ లో తన భర్త నిక్ జోనాస్ ని ఇసుకలోకి నెట్టేసిన పీసీ అతడిపై కూచుని సరదాగా ఫోటోలకు ఫోజులిస్తూ కనిపించింది. ఈ రోమాంచిత సన్నివేశానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో జోరుగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోగ్రాఫ్, వీడియో చూశాక పెళ్లయి ఇన్నేళ్లయినా కానీ హనీమూన్ పూర్తవ్వలేదు! అంటూ కామెంట్ చేసారు ఒకరు. కొందరు నెటిజనులు ఇది సిగ్గు లేని పని అని కూడా నిందించారు. ప్రియాంక చోప్రా కెరీర్ మ్యాటర్ కి వస్తే, తదుపరి రాజమౌళి - మహేష్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.