2024 ఎన్నికల్లో గెలుపు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు పలు అభివృద్ధి పనులు చేపట్టడమే కాదు ఇచ్చినమాట నిలబెట్టుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటూ భరోసా కల్పిస్తున్నారు. పంట నష్టపోయినోళ్లకు పరిహారం చెలించడమే కాదు ఇప్పుడు మామిడి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రూ. 260 కోట్ల నిధులు విడుదల చేయించడం సీఎం చంద్రబాబు డెడికేషన్ కు నిదర్శనము.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల ప్రకారం మామిడి రైతుల కోసం రూ. 260 కోట్ల నిధులను విడుదల చేసింది
ఈ నిధులు తోతాపురి మామిడిని రోజు ₹4 సబ్సిడీతో 6.5 లక్షల టన్నులు కొనుగోలు చేయడానికి వినియోగించబడతాయి
ఈ చర్య మార్కెట్ సమస్యలతో బాధపడుతున్న చిత్తూరు జిల్లా మామిడి రైతులకు ఉపయోగకరంగా మార్చింది
సబ్సిడీ మొత్తాన్ని రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నట్లు అధికారులు సూచిస్తున్నారు, ఆ మొత్తం అకౌంట్లలో జమ అయ్యిందో లేదో అనేది రైతులు తమ ఖాతాలను తనిఖీ చేసుకోవాలి అని సూచిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కోరుతూ ₹260 కోట్లు MIS విధానంపై పూర్తి సహాయం అందించాలని కోరింది
కొనుగోళ్లు ఆగష్టు 2025 వరకు కొనసాగించాలని, ప్రాసెసర్లు ₹8 ₹12/kg మద్దతు ధర ఇవ్వాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కోరింది.
ఈమేరకు మామిడి రైతుల కష్టాలు తీరినట్టే. మామిడి రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబు ని తమ కష్టాలు తీర్చినందుకు గాను కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నారు.