Advertisementt

సోలో బాయ్ రివ్యూ

Fri 04th Jul 2025 01:28 PM
solo boy review  సోలో బాయ్ రివ్యూ
Solo Boy Review సోలో బాయ్ రివ్యూ
Advertisement
Ads by CJ

సోలో బాయ్ రివ్యూ 

ఒక్కసారి కాదు రెండుసార్లు బిగ్ బాస్ లో చోటు సంపాదించి సీరియల్ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ కి ధీటుగా నిలబడడమే కాదు బిగ్ బాస్ సీజన్ 8 లో రన్నరప్ గా బయటికి వచ్చితిన గౌతమ్ కృష్ణ హీరోగా నవీన్ కుమార్ దర్శకత్వంలో సతీష్ నిర్మాతగా సోలో బాయ్ చిత్రాన్ని చేసాడు. కుటుంబ విలువలు, స్నేహబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి హీరోయిన్స్ గా నటించారు. గౌతమ్ కృష్ణ అండ్ టీమ్ సోలో బాయ్ ని భారీగా ప్రమోట్ చేసి నేడు జులై 4 న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి సోలో బాయ్ ఆడియన్స్ కు ఎంత రీచ్ అయ్యిందో అనేది సమీక్షలో చూసేద్దాం. 

కథ: 

మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లో పుట్టిన కృష్ణమూర్తి(గౌతమ్ కృష్ణ) కాలేజీలో ప్రేమించిన అమ్మాయికి కేవలం ఆర్థికంగా స్థిరపడలేదని కారణంతో బ్రేకప్ చెబుతాడు, అటు తర్వాత ఉద్యోగం చేసుకుంటూ మరొక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ ఆ పెళ్లి కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల విడాకులకు దారి తీస్తుంది. ఇటువంటి సిచువేషన్స్ లో నుండి హీరో బయటకు ఎలా వస్తాడు? కేవలం ఆర్థిక పరిస్థితులే దీనికి కారణమా లేదా ఇంకేమైనా కారణం ఉందా? అనే సింపుల్ స్టోరీనే సోలో బాయ్ కథ. 

నటీనటుల నటన: 

రియాలిటీ షో ద్వారా ప్రేక్షకులకు ఒరిజినల్ ఫేస్ తో దగ్గరైన గౌతమ్ కృష్ణ సోలో బాయ్ చిత్రంలో కృష్ణమూర్తి పాత్రలో తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఎమోషనల్ సీన్స్ నుండి ప్రతి సీన్ లోను ప్రేక్షకులను మెప్పించారు. ప్రియా క్యారెక్టర్ లో రమ్య పసుపులేటి సినిమాలో కనిపించే స్క్రీన్ టైమ్ తక్కువ అయినప్పటికీ అందంగా ఆకట్టుకుంది. అలాగే శ్వేత అవస్తి మంచి పర్ఫామెన్స్ తో తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. పోసాని మురళి, అనిత చౌదరి హీరోకు తల్లిదండ్రులుగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాతావరణం లో చాలా బాగా నటించారు. అలాగే భద్రం, షఫీ, చక్రపాణి తదితరులు తమ పాత్రల పరిధిలో నటిస్తూ చిత్రానికి బోనస్ గా నిలిచారు. 

టెక్నీకల్ గా..

దర్శకుడు నవీన్ కుమార్ ఒక చక్కటి ఫ్యామిలీ చిత్రాన్ని ప్రేక్షకులు ముందుకు తీసుకువెళ్లడంలో పూర్తిగా విజయం సాధించాడు. ప్రతి వ్యక్తి కనెక్ట్ అయ్యే విధంగా ఈ కథ ఉండటం ప్రత్యేకం. ఆ కథను వెండి ధరపై మంచి విజువల్స్ తో డిఓపి మరింత అందంగా చూపించారు. సినిమాలోని పాటలు సిచువేషన్ కి తగ్గట్లు BGM తో సినిమాను మరో మెట్టు పైకి వెళ్లే విధంగా సంగీత దర్శకుడు సహాయపడ్డాడు. డే అండ్ నైట్ షూట్స్ లో లైటింగ్ ఇంకా ఇతర బ్యాగ్రౌండ్ విషయాలలో తగ్గ జాగ్రత్తలు తీసుకున్నట్లు అర్థమవుతుంది. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. నిర్మాత ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చిత్రం కోసం వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్లినట్లు అర్థమవుతుంది. దర్శకుడు ప్రతి ఒక్కరిని పూర్తిగా వాడుకోవడంలో సక్సెస్ అయ్యారు. 

ప్లస్ పాయింట్స్ : 

కథ, బిజిఎం, సాంగ్స్, నటీనటుల నటన, డైలాగ్స్, నిర్మాణ విలువలు. 

మైనస్ పాయింట్స్ :

అతి తక్కువ సీన్లు, డైలాగ్స్ అంతగా రాకపోవడం. 

సారాంశం : 

ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే కథతో కుటుంబ సమేతంగా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన చిత్రం సోలో బాయ్.

రేటింగ్ : 2.5/5

Solo Boy Review:

Solo Boy Telugu Review

Tags:   SOLO BOY REVIEW
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ