Advertisementt

నటి పాకీజా కు పవన్ కళ్యాణ్ సాయం

Tue 01st Jul 2025 03:17 PM
pawan kalyan  నటి పాకీజా కు పవన్ కళ్యాణ్ సాయం
Pawan Kalyan helps actress Pakeezah నటి పాకీజా కు పవన్ కళ్యాణ్ సాయం
Advertisement
Ads by CJ

తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సినీ నటి శ్రీమతి వాసుకి (పాకీజా)కి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆప్త హస్తం అందించారు. ఆమె దీన స్థితి తెలిసి చలించిన పవన్ కళ్యాణ్ రూ. 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. మంగళగిరి మధ్యాహ్నం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఈ మొత్తాన్ని శాసన మండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పి. హరిప్రసాద్ గారు, పి.గన్నవరం శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ  పాకీజాకు అందజేశారు. 

పవన్ కళ్యాణ్ చేసిన సాయానికి పాకీజా గారు కృతజ్ఞతలు తెలిపారు. చిన్నవాడైనా ఎదురుగా ఉంటే కాళ్లు మొక్కుతానంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తన ఆర్థిక పరిస్థితి గురించి నిన్ననే పవన్ కళ్యాణ్ కార్యాలయానికి తెలియజేశాననీ, తక్షణం స్పందించి తగిన విధంగా ఆర్థిక సాయం అందించారని తెలిపారు. పవన్ కళ్యాణ్ కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు.

Pawan Kalyan helps actress Pakeezah:

Pawan Kalyan

Tags:   PAWAN KALYAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ