Advertisementt



QR కోడ్ తో వైసీపీ ఫ్రాడ్

Sat 28th Jun 2025 11:44 AM
ycp  QR కోడ్ తో వైసీపీ ఫ్రాడ్
YSRCP QR కోడ్ తో వైసీపీ ఫ్రాడ్
Advertisement
Ads by CJ

QR కోడ్ తో చంద్రబాబు మోసాలను బయటపెడతామని చెప్పిన వైసీపీ నేతలు ఆ QR కోడ్ తో సామాన్యుల నుంచి డబ్బు ని చాకచక్యంగా కొట్టెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. 

వైసీపీ వాళ్ళు QR కోడ్ పేరుతొ అకౌంట్ లో డబ్బులు కొట్టేస్తారు జాగ్రత్త అని మొత్తుకున్నారు టీడీపీ నేతలు. అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో ఫ్రాడ్ పనులు చేసిన వైసీపీ కార్యకర్తలు మరోసారి తమ దొంగబుద్ధిని బయటపెట్టుకున్నారు. డబ్బా కొడుతూ అనంతపురంలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం నిర్వహించిన వైసీపీ నేతలు, జవహర్ కాలనీలో జరిగిన కార్యక్రమానికి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి లాంటి వైసీపీ నేతలు హాజరయ్యారు. 

అందులో భాగంగా ఫోన్ లో QR కోడ్ స్కాన్ చేస్తే చంద్రబాబు మోసాలు బయటపడతాయని ఓ కుటుంబం వద్దకు వెళ్లిన వైసీపీ కార్యకర్తలు ఆ ఫోన్ తీసుకుని QR కోడ్ స్కాన్ చేస్తున్నట్టుగా నటించి ఫోన్ పే స్కాన్ చేసి డబ్బులు కొట్టెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. అనంతపురం పట్టణంలోని జవహర్ కాలనీలో బోయ ఎర్రప్ప అకౌంట్లో డబ్బులు వైసీపీ కార్యకర్తలు కాజేసినట్లుగా తెలుస్తుంది. 

అంతేకాకుండా ఫోన్ పే నుంచి డబ్బులు కట్ అయిన్ మెసేజ్ ను కూడా డిలీట్ చేసేసినట్లుగా.. సదరు బాధితుడు కంప్లైంట్ చేసారు. సాయంత్రం షాపు వద్దకు వెళ్లి కొనుగోలు చేసిన వాటికి డబ్బులు చెల్లించేందుకు ఫోన్ పే స్కాన్ చేయగా చెక్ ద అమౌంట్ అంటూ చూపించడంతో ఖంగుతిన్న ఎర్రప్ప బ్యాలెన్స్ చెక్ చేయగా జీరో అమౌంట్ అని చూపించడంతో లబోదిబోమంటూ  పోలీసులను ఆశ్రయించాడు.  తన అకౌంట్లో ఉన్న రూ.11 వేలు కొట్టేశారంటూ అనంతపురం అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎర్రప్ప. వైసీపీ కార్యకర్తలు QR కోడ్ స్కాన్ పేరుతొ జరిగే మోసాలను టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎప్పటికప్పుడు బయటపెడుతున్నారు. 

YSRCP:

YCP

Tags:   YCP
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ