Advertisementt

వార్ 2 ఐమ్యాక్స్ ట్రీట్

Thu 26th Jun 2025 01:52 PM
war 2  వార్ 2 ఐమ్యాక్స్ ట్రీట్
WAR 2 to have a Global IMAX Release in theatres on August 14 వార్ 2 ఐమ్యాక్స్ ట్రీట్
Advertisement
Ads by CJ

భారతదేశపు ప్రముఖ సినిమా నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ (YRF).  దేశంలో అతిపెద్ద సినిమాటిక్ ఫ్రాంచైజీలకు కేరాఫ్‌గా నిలుస్తోన్న ఈ సంస్థ, మోస్ట్ అవెయిటింగ్  స్పై యాక్షన్ థ్రిల్లర్‌ ఆఫ్ ది ఇయర్ వార్ 2ను ఆగస్టు 14, 2025న IMAX థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా  విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా ఉత్తర అమెరికా, మిడిల్ ఈస్ట్, యుకె, యూరప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, సౌతీఈస్ట్ ఆసియా సహా భారతదేశంలో IMAX థియేటర్లలో విడుదల కానుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులకు నెక్ట్స్ లెవల్లో ఓ అద్భుతమైన ఎక్స్‌పీరియెన్స్‌ను ఈ చిత్రం అందించనుంది.

YRF స్పై యూనివర్స్‌లో వార్ 2 చిత్రం లేటెస్ట్‌గా రూపొందిన భారతదేశపు అతిపెద్ద, అత్యంత విజయవంతమైన ఫిలిం ఫ్రాంచైజీలలో ఒకటి. పఠాన్, టైగర్ 3, WAR మొదటి భాగం వంటి బ్లాక్‌బస్టర్‌ల తర్వాత రాబోతున్న కొత్త మూవీ ఇది. 2023లో విడుదలైన పఠాన్ భారతీయ బాక్సాఫీసులో అత్యధిక IMAX కలెక్షన్లలో ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇది ఈ స్పై యూనివర్స్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ ఏంటో తెలియజేస్తోంది.

WAR 2 కి సంబంధించి YRF  సంస్థ వార్ 2 రిలీజ్‌కు ఇంకా 50 రోజులు మాత్రమే ఉందని తెలియజేసే సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, కియారా అద్వానీ ల పోస్టర్లను నిర్మాణ సంస్థ విడుదల చేసింది.

యశ్ రాజ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూషన్ వైస్ ప్రెసిడెంట్ నెల్సన్ డిసౌజా ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘యశ్ రాజ్ ఫిలింస్‌గా భారతీయ సినిమాను ప్రపంచ స్థాయిలో ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం. వార్ 2 అనేది YRF స్పై యూనివర్స్‌లో ఒక ముఖ్యమైన భాగం. ఇండియన్ సినిమాలో ఇద్దరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అయిన  హృతిక్ రోషన్, ఎన్టీఆర్  మధ్య జరిగే ఈ అద్భుతమైన తలపోరును IMAX ఫార్మాట్‌లో ప్రదర్శించడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులకు, ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతిని అందించగలగుతాం అన్నారు.

IMAX ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్, డిస్ట్రిబ్యూషన్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్టఫర్ టిల్ల్మాన్ మాట్లాడుతూ, వార్ 2 అనే ఈ భారీ ఇండియన్ యాక్షన్ చిత్రాన్ని గ్లోబల్ IMAX థియేటర్లకు తీసుకురావడం మాకు ఆనందంగా ఉంది. ఈ ఏడాదిలో అతి పెద్ద ఇండియన్ బిగ్గెస్ట్ ఫిల్మ్ కోసం  యశ్ రాజ్ ఫిల్మ్స్, ఆదిత్య చోప్రాతో చేతులు కలపటం చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు అయ్యన్ ముఖర్జీ రూపొందిస్తున్న ఈ సినిమా యాక్షన్ సినిమాకే ఓ పాఠంలా ఉంటుంది. హృతిక్, ఎన్టీఆర్ మధ్య యాక్షన్ సన్నివేశాలు, వారి అద్భుతమైన పెర్ఫామెన్స్‌లు గూజ్ బంప్స్ తెప్పిస్తాయి. ఇలాంటి తిరుగులేని, మరచిపోలేని సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఐ మ్యాక్స్‌లో మాత్రమే పొందగలరు. అని అన్నారు.

అద్భుతమైన విజువల్స్, వావ్ అనిపించే యాక్షన్ సీక్వెన్స్‌లతో కూడిన వార్2 ను దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించాడు. అతి పెద్దగా ఉండే ఐ మ్యాక్స్ స్క్రీన్ ఎక్స్‌పీరియెన్స్, ఆకట్టుకునే సౌండింగ్‌తో సినిమాను రూపొందించారు.  

ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఇప్పటికే WAR 2 IMAX టీజర్ ప్రదర్శన మొదలైంది. పూర్తి చిత్రం ఆగస్టు 14, 2025న IMAXలో మాత్రమే విడుదల అవుతుంది.

WAR 2 to have a Global IMAX Release in theatres on August 14:

Yash Raj Films WAR 2 to have a Global IMAX Release in theatres on August 14

Tags:   WAR 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ