Advertisementt

పెళ్లిపై తేల్చేసిన అక్కినేని హీరో

Sun 11th May 2025 04:51 PM
sumanth  పెళ్లిపై తేల్చేసిన అక్కినేని హీరో
Akkineni hero on his marriage పెళ్లిపై తేల్చేసిన అక్కినేని హీరో
Advertisement
Ads by CJ

అక్కినేని నాగేశ్వరావు ముద్దుల మనవడు, హీరో సుమంత్ మహేష్ బాబు కి అక్కగా అర్జున్ చిత్రంలో నటించిన కీర్తి రెడ్డి ని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. కానీ ఆ పెళ్లి ఎంతో కాలం నిలవలేదు, కీర్తి రెడ్డి తో విడాకులయ్యాక సుమంత్ సింగిల్ లైఫ్ నే లీడ్ చేస్తున్నాడు. తాజాగా సుమంత్ ఓ హీరోయిన్ ని పెళ్లాడబోతున్నాడనే వార్త వైరల్ అయ్యి కూర్చుంది.

గత రెండు రోజులుగా సుమంత్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ని వివాహం చేసుకోబోతున్నాడు అంటూ పుకార్లు ఊపందుకున్నాయి. కారణం సుమంత్ తో కలిసి మృణాల్ ఠాకూర్ దిగిన పిక్ నెట్టింట వైరల్ అవడమే. ఆ పిక్ చూసి సుమంత్-మృణాల్ ఠాకూర్ వివాహం త్వరలోనే అంటూ ప్రచారం మొదలైంది. అయితే తాజాగా సుమంత్ తాజాగా తన పెళ్లిపై వస్తున్న వార్తలపై రియాక్ట్ అయ్యాడు.

నాకు పెళ్లిపై ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, ఇలా ఒంటరిగా ఉండడమే నాకు నచ్చుతుంది. నాకు ఓ తోడు కావాలని ఎప్పుడూ అనిపించలేదు. ఇలా ఒంటరిగా ఉన్నందుకు నాకస్సలు బోర్ కొట్టాడు, బోర్ అనే పదమే నా డిక్షనరీలో లేదు.. అంటూ సుమంత్ తన పెళ్లిపై వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టాడు. సో మృణాల్ తో సుమంత్ పెళ్లి జరగడం లేదు, అవన్నీ గాలివార్తలే అన్నమాట.  

Akkineni hero on his marriage:

  Akkineni hero Sumanth Says he will remain single  

Tags:   SUMANTH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ