Advertisementt

మోక్షజ్ఞతో ఆదిత్య 369 సీక్వెల్ - బాలయ్య

Wed 04th Dec 2024 05:34 PM
balakrishna  మోక్షజ్ఞతో ఆదిత్య 369 సీక్వెల్ - బాలయ్య
Aditya 369 sequel with Mokshagna - Balayya మోక్షజ్ఞతో ఆదిత్య 369 సీక్వెల్ - బాలయ్య
Advertisement
Ads by CJ

లెజెండరీ యాక్టర్ నందమూరి బాలకృష్ణ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్, కమాండింగ్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు చిరునామా. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన 1991 సైన్స్ ఫిక్షన్ ఆదిత్య 369 NBK ఐకానిక్ చిత్రాలలో ఒకటి. శ్రీ కృష్ణ దేవరాయలుగా బాలకృష్ణ పాత్ర ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది. ఈ చిత్రం ఎవర్ గ్రీన్ క్లాసిక్‌.

ఒక ఎక్సయిటింగ్ డెవలప్మెంట్ లో డిసెంబర్ 6, 2024న ప్రసారం కానున్న అన్‌స్టాపబుల్ విత్ NBK (సీజన్ 4) ఆరవ ఎపిసోడ్ సందర్భంగా బాలకృష్ణ ఆదిత్య 369కి సీక్వెల్‌ను అనౌన్స్ చేశారు. ఆదిత్య 999 మ్యాక్స్ పేరుతో ఈ సీక్వెల్ అఫీషియల్ గా వర్క్ లో వుంది, ఈ మోస్ట్ అవైటెడ్ టైమ్-ట్రావెల్ సాగాలో నెక్స్ట్ చాప్టర్ కోసం అభిమానుల్లో ఎక్సయిట్మెంట్ ని క్రియేట్ చేసింది.

ఆదిత్య 999 మ్యాక్స్‌లో బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ లీడ్ రోల్ లో నటించనున్నారు. బాలకృష్ణ స్క్రిప్ట్‌లో నిమగ్నమై ఉన్నారు. సీక్వెల్ మోడరన్ సినిమాటిక్ ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తూ లెగసీని ముందుకు తీసుకెళుతోంది.  

అన్‌స్టాపబుల్ విత్ NBK  అప్ కమింగ్ ఎపిసోడ్‌లో బాలకృష్ణ తన ఆదిత్య 369 అవతార్‌లో కనిపిస్తారు, సీక్వెల్ గురించి మరిన్ని వివరాలను వెల్లడించడంతో పాటు ఆదిత్య 999 మ్యాక్స్ మేకింగ్ సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్ అందిస్తుంది.

డిసెంబర్ 6, 2024న ఎపిసోడ్ ఆహాలో ప్రసారం అవుతోంది, బాలకృష్ణ, అతిధులు నవీన్ పోలిశెట్టి, శ్రీలీలతో కాండిడ్ మూమెంట్స్ ని ప్రామిస్ చేస్తుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆదిత్య 999 మ్యాక్స్‌ లోని అన్ని ఇన్ సైడ్ డీటెయిల్స్ కోసం ఈ ఎక్సయిటింగ్ ఎపిసోడ్‌ని మిస్ అవ్వకండి.

Aditya 369 sequel with Mokshagna - Balayya:

Balakrishna Aditya 369 Sequel With Mokshagnya

Tags:   BALAKRISHNA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ