Siruya కంగువ ట్రైలర్ వచ్చేస్తోంది!!

కోలీవుడ్ స్టార్ సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ కంగువ. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 10న దసరా పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ నెల 12వ తేదీన కంగువ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
కంగువ నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన సిజిల్ టీజర్, పోస్టర్స్, ఫైర్ సాంగ్ సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి. ట్రైలర్ పై కూడా హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. పీరియాడిక్ యాక్షన్ జానర్ లో ఇప్పటిదాకా తెరపైకి రాని ఒక కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోబోతోందీ సినిమా.
పది భాషల్లో తెరకెక్కుతున్న కంగువ త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు.
Suriya Kanguva theatrical trailer releasing on August 12th
Kanguva theatrical trailer releasing on August 12th







































