Advertisementt

ముంబైలో మార్టిన్ ట్రైలర్ గ్రాండ్ రిలీజ్

Tue 06th Aug 2024 07:32 PM
martin  ముంబైలో మార్టిన్ ట్రైలర్ గ్రాండ్ రిలీజ్
Martin trailer released ముంబైలో మార్టిన్ ట్రైలర్ గ్రాండ్ రిలీజ్
Advertisement
Ads by CJ

ఇండియా వాణిజ్య న‌గ‌రం ముంబైలో భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మార్టిన్ ట్రైల‌ర్‌ను గ్రాండ్ రిలీజ్ చేశారు. ధృవ హీరోగా న‌టించిన ఈ సినిమా ట్రైల‌ర్ లాంచ్ వేడుక‌కు ఇండియాలోని టాప్ క్రిటిక్స్‌, జర్న‌లిస్టులు హాజ‌ర‌య్యారు. ఈవెంట్‌ను చాలా గ్రాండ్‌గా, స‌క్సెస్‌ఫుల్‌గా నిర్వ‌హించారు. 

ఈ కార్యక్రమంలో ప్రపంచ వేదికపై భారతీయ చిత్రాలకు సంబంధించిన‌ కొత్త కోణాలను, అవకాశాలను అద్భుతంగా హైలైట్ చేస్తూ ప్ర‌ద‌ర్శించారు. మార్టిన్ సినిమా గురించి చెప్పాలంటే మూవీ ట్రైలర్ అద్భుతంగా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. భ‌విష్య‌త్ సినిమాకు ఓ బెంచ్ మార్క్ సెట్ చేసేలా సినిమాను రూపొందించిన‌ట్లు ట్రైల‌ర్ చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. 

మార్టిన్ మూవీ ట్రైల‌ర్‌ను గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేయ‌టానికి కార‌ణం విజువ‌ల్‌గా ఇండియ‌న్ సినిమా ఎంత గొప్ప సినిమాల‌ను రూపొందిస్తుంద‌నే విష‌యాన్ని ప్ర‌పంచానికి తెలియ‌జేయ‌ట‌మే. ఎంతో ఘ‌నంగా జ‌రిగిన ఈ వేడుక భార‌తీయ సినిమా అభివృద్ధి చెందిన తీరుని, ఆ ప్ర‌భావం ఇత‌ర సినిమాల‌పై ఎలా ఉంద‌నే విష‌యాన్ని బ‌లంగా చెప్ప‌ట‌మే. అంతే కాకుండా నిర్మాత‌లు అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా అంత‌ర్జాతీయ సినీ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేలా సినిమాను నిర్మించార‌నే విష‌యాన్ని స్ప‌ష్టం చేయ‌ట‌మే ఈ వేడుక ఉద్దేశం. 

ప్రపంచ సినిమాలో మ‌న ఇండియ‌న్ సినిమా ప్ర‌భావాన్ని, సృజ‌నాత్మ‌క‌త‌ను బ‌లంగా చెప్ప‌ట‌మే ఈ ఈవెంట్ ల‌క్ష్యం. భార‌తీయ సినిమాలో ఇది కొత్త శ‌కాన్ని సూచిస్తుంది.

Martin trailer released:

Martin trailer grand release in Mumbai

Tags:   MARTIN
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ