Advertisementt

చాలా రోజుల తర్వాత మీటయిన మన్మథుడు జోడి

Mon 04th Mar 2024 02:59 PM
manmadhudu  చాలా రోజుల తర్వాత మీటయిన మన్మథుడు జోడి
Nagarjuna Akkineni and Anshu Meet After a Long Gap చాలా రోజుల తర్వాత మీటయిన మన్మథుడు జోడి
Advertisement
Ads by CJ

కింగ్ నాగార్జున కెరీర్ లో ఎంతో స్పెషల్ మూవీగా నిలిచిపోయింది మన్మథుడు. విజయ భాస్కర్ దర్శకత్వంలో త్రివిక్రమ్ కథ మాటలు అందించిన ఈ కూల్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తెరపైకి వచ్చి 22 ఏళ్లవుతోంది. మన్మథుడు సినిమాలో అభిగా నాగార్జున, మహి క్యారెక్టర్ లో అన్షు జోడి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అన్షు పెళ్లయ్యాక కుటుంబంతో లండన్ లో స్థిరపడింది. 

ఇటీవల ఆమె ఇండియాకు వచ్చింది. హైదరాబాద్ లోని తన స్నేహితులను మీట్ అవుతోంది. ఈ సందర్భంగా అన్షు ఫ్రెండ్ ఇచ్చిన పార్టీకి నాగార్జున, అమల హాజరయ్యారు. ఇన్నేళ్ల తర్వాత ఈ పార్టీలో మన్మథుడు జంట నాగార్జున, అన్షు మీట్ అయ్యారు. తాము కలిసి నటించిన మెమొరీస్ షేర్ చేసుకున్నారు. నాగార్జున, అన్షు మీట్ అయిన ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అభి, మహి బెస్ట్ పెయిర్ అంటూ నెటిజన్స్ స్పందిస్తున్నారు.

Nagarjuna Akkineni and Anshu Meet After a Long Gap:

Manmadhudu Jodi Nagarjuna Akkineni and Anshu Meet After a Long Gap

Tags:   MANMADHUDU
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ