Advertisementt

అంబాజీపేట 2 రోజుల కలెక్షన్స్

Sun 04th Feb 2024 03:52 PM
ambajipeta marriage  అంబాజీపేట 2 రోజుల కలెక్షన్స్
Ambajipeta Marriage 2 Days Collections అంబాజీపేట 2 రోజుల కలెక్షన్స్
Advertisement
Ads by CJ

కంటెంట్ బాగున్న సినిమాకు విజయం తప్పకుండా దక్కుతుందని మరోసారి ప్రూవ్ చేసింది అంబాజీపేట మ్యారేజి బ్యాండు. సుహాస్ హీరోగా నటించిన ఈ సినిమా ఈ నెల 2వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రీమియర్స్ నుంచి వచ్చిన పాజిటివ్ టాక్, మీడియా ఇచ్చిన మంచి రేటింగ్స్ తో అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాకు డే 1 కలెక్షన్స్ అదిరిపోయాయి. రెండో రోజున ఆ ట్రెండ్ మరింత స్ట్రాంగ్ గా కొనసాగింది. 2 రోజుల్లో ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా 5.16కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ దక్కాయి. 

ఆదివారం అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ కావడం సినిమా ప్రేక్షకుల్లో ఎంత రూటెట్ గా చేరిందని తెలియజేస్తోంది. ప్రేక్షకుల్ని ఆకట్టుకునే సహజమైన కథా కథనాలు, ఎమోషన్, నటీనటుల పర్ ఫార్మెన్స్ , టెక్నికల్ గా మూవీ స్ట్రాంగ్ గా ఉండటం వంటి అంశాలన్నీ అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాను సూపర్ హిట్ చేశాయి. 

అంబాజీపేట మ్యారేజి బ్యాండు చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. దర్శకుడు దుశ్యంత్ కటికినేని రూపొందించారు. శివాని నాగరం హీరోయిన్ గా నటించగా..శరణ్య ప్రదీప్, నితిన్ కీ రోల్స్ చేశారు.

Ambajipeta Marriage 2 Days Collections:

Ambajipeta Marriage 2 Days Worldwide Collections

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ