Advertisementt

గేమ్ చేంజర్ సాంగ్ లీక్-దొరికిన దొంగలు

Mon 06th Nov 2023 02:28 PM
game changer  గేమ్ చేంజర్ సాంగ్ లీక్-దొరికిన దొంగలు
Cyber Police arrest two for leaking Game Changer song గేమ్ చేంజర్ సాంగ్ లీక్-దొరికిన దొంగలు
Advertisement
Ads by CJ

రామ్ చ‌ర‌ణ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం గేమ్ చేంజ‌ర్‌.  భారీ బ‌డ్జెట్‌తో నిర్మాత‌లు దిల్ రాజు, శిరీష్ అన్ కాంప్ర‌మైజ్డ్‌గా అంచ‌నాల‌కు ధీటుగా గేమ్ చేంజ‌ర్‌ను నిర్మిస్తున్నారు. RRR వంటి సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ చేస్తోన్న సినిమా కావ‌టంతో గేమ్ ఛేంజ‌ర్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. 

గేమ్ చేంజర్ సినిమా నుంచి గతంలో ఓ పాట లీక్ అయింది. దీనిపై నిర్మాత దిల్ రాజు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సాంగ్ లీక్‌పై సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ లీకులో భాగమైన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి లీకులు చేయొద్దని హెచ్చరించారు. సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీ చాంద్ భాషా, ఎస్సై శ్రీ భాస్కర్ రెడ్డి, శ్రీ ప్రసేన్ రెడ్డి, శ్రీ సాయి తేజ్ గార్ల బృందం ఈ కేసును చేధించారు. సాంగ్‌ లీక్ చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరి మీద ఐటీ చట్టంలోని సెక్షన్ 66సీ, 66 ఆర్/డబ్ల్యూ కింద కేసు నమోదు చేశారు.

దీపావ‌ళి సంద‌ర్బంగా గేమ్ ఛేంజ‌ర్ సినిమా నుంచి తొలి సాంగ్‌ను విడుద‌ల చేస్తున్నారు. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, సెన్సేషనల్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌ల‌తో పాటు మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ క‌లిసి తొలిసారి వ‌ర్క్ చేస్తున్న గేమ్ ఛేంజ‌ర్ సినిమా నుంచి పాట‌ను పాన్ ఇండియా రేంజ్‌లో దీపావళికి గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. 

సౌత్ ఇండియ‌న్ సినిమా రేంజ్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కి తీసుకెళ్లిన సెన్సేషనల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ మేకింగ్ ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న తెర‌కెక్కించిన సినిమాల‌ను మించేలా గేమ్ ఛేంజ‌ర్‌ ను ఆయ‌న రూపొందిస్తున్నారు. పవరఫుల్  రోల్ లో చ‌ర‌ణ్‌ను ప్రెజెంట్ చేస్తున్నారు శంక‌ర్‌. ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతోందన్న సంగతి తెలిసిందే.

Cyber Police arrest two for leaking Game Changer song:

Cyber Police arrest two for leaking Ram Charan Game Changer song

Tags:   GAME CHANGER
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ