Advertisementt

యాత్ర 2 ఫ‌స్ట్ లుక్ విడుదల

Mon 09th Oct 2023 11:23 AM
yatra 2  యాత్ర 2 ఫ‌స్ట్ లుక్ విడుదల
Yatra 2 fist look యాత్ర 2 ఫ‌స్ట్ లుక్ విడుదల
Advertisement
Ads by CJ

మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాత్ర  2  సినిమాలో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి,  వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, పాత్రలకు సంబంధించిన  ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ సోమవారం విడుదల చేసింది. వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాత్ర‌లో మ‌ల‌యాళం సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి, వై.ఎస్‌.జ‌గ‌న్‌ పాత్ర‌లో కోలీవుడ్ స్టార్ జీవా న‌టిస్తున్నారు. 

ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే, మ‌మ్ముట్టి, జీవా ఇన్‌టెన్స్ లుక్స్‌తో క‌నిపిస్తున్నారు. నేనెవరో ఈ ప్రపంచానికి తెలియకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి...నేను వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కొడుకుని అనే ఎమోషనల్ డైలాగ్‌ను కూడా పోస్ట‌ర్‌లో గ‌మ‌నించ‌వ‌చ్చు. పోస్ట‌ర్ చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంది. 

ఏపీ దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో యాత్ర చిత్రాన్ని తెరకెక్కించారు. అత్యంత ప్ర‌జాద‌ర‌ణను పొందిన ఈ చిత్రంకు కొన‌సాగింపుగా, వైఎస్‌.ఆర్ త‌న‌యుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా నాయ‌కుడిగా ఎదిగిన తీరుని, 2009 నుంచి 2019 వరకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఇప్పుడు యాత్ర 2ని తెర‌కెక్కిస్తున్నారు. యాత్ర చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 8, 2019లో విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. అలాగే ఇప్పుడు యాత్ర 2 ని కూడా అదే తేదీన ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నారు, 2024 ఫిబ్రవరి 8న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధ‌మవుతుంది. 

ప్రస్తుతం శ‌ర‌వేగంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి మది కెమెరామెన్. సంతోష్ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు.

Yatra 2 fist look :

Yatra 2 fist look out

Tags:   YATRA 2
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ