షారుఖ్-నయన్ కెమిస్ట్రీ సూపర్ గా..

Mon 14th Aug 2023 04:25 PM
jawan  షారుఖ్-నయన్ కెమిస్ట్రీ సూపర్ గా..
Nayanthara Along with SRK Bring The Magic Of Love షారుఖ్-నయన్ కెమిస్ట్రీ సూపర్ గా..
Advertisement
Ads by CJ

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ హీరోగా రూపొందుతోన్న భారీ చిత్రం జవాన్. అట్లీ దర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 7న తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల‌వుతుంది.  సోమ‌వారం ఈ సినిమా నుంచి ఛలోనా.. సాంగ్ రిలీజ్ అయ్యింది. అనిరుద్ ర‌విచందర్ సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ సినిమాలోని పాట‌ను ఆదిత్య ఆర్‌.కె, ప్రియా మాలి పాడారు. ఆస్కార్ విన్న‌ర్ చంద్ర‌బోస్ పాట‌ను రాశారు. రొమాంటిక్ సాంగ్స్ రారాజుగా పిల‌వ‌బ‌డే షారూఖ్ ఖాన్ మ‌రోసారి ఛలోనా.. సాంగ్‌లో త‌న మార్క్ చూపించారు. 

ఈ రొమాంటిక్ సాంగ్‌లో షారూఖ్ ఖాన్‌, న‌య‌న‌తార జంట చూడ చ‌క్క‌గా ఉంది. ఈ పాట‌కు ఫ‌రహ్ ఖాన్ కొరియోగ్ర‌ఫీ అందించారు. ఆమె త‌న‌దైన స్టైల్లో సిగ్నేచ‌ర్ స్టెప్పుల‌తో మెప్పించారు. ఆదిత్య ఆర్‌.కె., ప్రియా మాలి శ్రావ్య‌మైన గొంతుక‌ల‌తో పాట‌కు ప్రాణం పోశారు. ప్రేమలోని శ‌క్తిని, స్వ‌చ్చ‌త‌ను పాట తెలియ‌జేస్తోంది. 

షారూఖ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న జవాన్ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. గౌర‌వ్ వ‌ర్మ ఈ సినిమాకు స‌హ నిర్మాత‌. సెప్టెంబ‌ర్ 7న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, త‌మిళ భాషల్లో రిలీజ్ అవుతుంది.

Nayanthara Along with SRK Bring The Magic Of Love:

Jawan: CHALONA SONG OUT NOW!  

Tags:   JAWAN
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ