విజయ్-సామ్ ఖుషి సినిమా షూట్ పూర్తి

Sat 15th Jul 2023 08:48 PM
kush  విజయ్-సామ్ ఖుషి సినిమా షూట్ పూర్తి
Kushi wrapped up with ongoing post production విజయ్-సామ్ ఖుషి సినిమా షూట్ పూర్తి
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండ, సమంత నటిస్తున్న చిత్రం ఖుషి. పాన్ ఇండియాగా రాబోతోన్న ఈ మూవీని శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మీద ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాను సెప్టెంబర్ 1న రిలీజ్ చేయబోతోన్నారు. షూటింగ్‌ను చకచకా చేస్తూ వచ్చిన చిత్రయూనిట్ ఇప్పుడు ఓ అప్డేట్ ఇచ్చింది.

ఖుషి సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఈ మేరకు మేకర్లు అప్డేట్ ఇచ్చారు. అలానే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా షూటింగ్‌కు సమాంతరంగా జరుపుతూ వచ్చారు. ఇప్పటికే 70శాతం పనులు పూర్తయ్యాయి.

ఇప్పటికే హిషామ్ అబ్దుల్ వాహబ్ అందించిన రెండు పాటలు సోషల్ మీడియాలో శ్రోతలను అలరిస్తున్నాయి. ప్రేమికులంతా కూడా పాడుకునేలా రొమాంటిక్, మెలోడీ పాటలను రిలీజ్ చేసిన చిత్రయూనిట్.. వాటితో అందరినీ ఆకట్టుకుంది.

సెప్టెంబర్ 1న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతోన్నారు.

Kushi wrapped up with ongoing post production:

Vijay Deverakonda Kushi wrapped up with ongoing post production

Tags:   KUSH
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ