ఆహాలో విశ్వక్ సేన్ షో

Fri 14th Jul 2023 05:56 PM
vishwak sen  ఆహాలో విశ్వక్ సేన్ షో
Vishwak Sen to Make His OTT Debut ఆహాలో విశ్వక్ సేన్ షో
Advertisement
Ads by CJ

తెలుగు ప్రేక్ష‌కులకు అప‌రిమిత‌మైన ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ వారి హృద‌యాల్లో శాశ్వ‌త‌మైన స్థానాన్ని సంపాదించుకున్న వ‌న్ అండ్ ఓన్లీ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహా. బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లో, స్పెష‌ల్ టాక్ షోస్‌, రియాలిటీ షోస్ ఇలా ప్ర‌తీ వారం తెలుగు ప్రేక్ష‌కుల ముంగిట స‌రికొత్త హంగామాను పుట్టించ‌టంలో ఆహా త‌న‌దైన పాత్ర‌ను పోషిస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు మ‌రో విల‌క్ష‌ణ‌మైన షో తో ముందుకు రానుంది. 

తెలుగు స్టార్ న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌ను ఓటీటీ మాధ్య‌మంలోకి రంగ ప్ర‌వేశం చేయించిన ఆహా ఇప్పుడు మ‌రో యంగ్ టాలెంటెడ్ హీరోను ఆడియెన్స్‌ను అల‌రించ‌టానికి సిద్ధం చేస్తోంది. అత‌నెవ‌రో కాదు..విశ్వ‌క్ సేన్‌. ఫ‌ల‌క్‌నుమా దాస్‌, హిట్‌, ఓరి దేవుడా, దాస్ కా ధ‌మ్కీ వంటి వైవిధ్య‌మైన చిత్రాల‌తో కెరీర్ ప్రారంభం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు విల‌క్ష‌ణ‌మైన సినిమాలు చేస్తూ హీరోగా త‌న‌దైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న యువ కథానాయ‌కుడు విశ్వ‌క్ సేన్‌. 

ఓ వైపు తిరుగులేని టాలెంట్‌, మ‌రో వైపు ఎన‌ర్జీతో సిల్వ‌ర్ స్క్రీన్‌పై ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన విశ్వ‌క్ సేన్ ఇప్పుడు ఆహా ఆడియెన్స్‌ను త్వ‌ర‌లోనే అల‌రించ‌బోతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు విశ్వ‌క్ సేన్‌ను చూడ‌న‌టువంట స‌రికొత్త అవ‌తార్‌లో ఆహా ఆవిష్క‌రించ‌నుంది. ఫుల్ మీల్స్ లాంటి ఎంటర్టైనింగ్ షో ని 15 ఎపిసోడ్స్‌ గా ఆహా సిద్ధం చేస్తోంది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది. 

Vishwak Sen to Make His OTT Debut :

Vishwak Sen to Make His OTT Debut on aha

Tags:   VISHWAK SEN
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ